Advertisementt

రాజు రిలీజ్ కాకముందే సురేష్ బాబుకు షాక్..!

Fri 11th Aug 2017 02:17 PM
chirala suresh mahal,nene raju nene mantri,suresh babu,rana  రాజు రిలీజ్ కాకముందే సురేష్ బాబుకు షాక్..!
Massive Fire Accident in Chirala Suresh Mahal Theatre రాజు రిలీజ్ కాకముందే సురేష్ బాబుకు షాక్..!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కు చెందిన ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని సురేష్ మహల్‌ థియేటర్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ థియేటర్ లో గత కొంత కాలంగా మరమ్మతులు జరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రెండు థియేటర్లుగా మారుస్తున్నారు. అందులో ఒక థియేటర్‌ పూర్తి కావడంతో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో థియేటర్ ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ థియేటర్ అగ్ని కి ఆహుతి అయ్యింది. 

హడావుడిగా ఏసీలు బిగించే సమయంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే హాల్‌ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా..థియేటర్ అప్పటికే చాలావరకు దగ్ధమైంది. తేజ దర్శకత్వం లో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించారు. తన కొడుకు సినిమాతో థియేటర్ ని ప్రారంభించాలని ఎంతగానో తాపత్రయ పడ్డ సురేష్ బాబు..ఈ విషయంతో చాలా నిరాశకు గురయ్యారు. 

Massive Fire Accident in Chirala Suresh Mahal Theatre:

Tollywood Producer, distributor, exhibitor and Studio owner Daggubati Suresh Babu has got a set-back in the plans to build a multiplex theatre, near his native place, Chirala. In a tragic incident, a fire broke out at Suresh Babu’s Suresh Mahal Theatre in Chirala due to a short circuit on Thursday.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ