మొదటి నుండి మాస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తాను తీసే సినిమాల్లో యాక్షన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఇప్పటి వరకూ అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను. 'భద్ర' చిత్రం అప్పటినుండి ఇప్పుడు విడుదల కాబోయే 'జయ జానకి నాయక' చిత్రం వరకు బోయపాటి తన మార్క్ మాస్ ని వదలకుండా మెయింటింగ్ చేస్తూ వస్తున్నాడు. ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కించిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బోయపాటి తన నెక్స్ట్ చిత్రాల గురించి క్లారిటీ ఇచ్చాడు.
తన నెక్స్ట్ చిత్రాలను చిరంజీవితోను, బాలకృష్ణ తోనూ, మహేష్ బాబు తోనూ తియ్యబోతున్నట్లు చెప్పాడు. ఇప్పటికే చిరంజీవికి సంబందించిన కథ రెడీ అయ్యిందని.... ఆయన నటించబోయే 'ఉయ్యాలవాడ' చిత్రం తర్వాత చిరుని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని చెప్పాడు. అలాగే మరో సినిమా కోసం హీరో మహేష్ తో చర్చలు జరిపినట్లు... కానీ కథ ఇంకా చెప్పలేదని మాత్రం చెప్పాడు. ఇకపోతే బాలకృష్ణ తో మరో సినిమా అవకాశం కోసం బోయపాటి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే బోయపాటి - బాలయ్య కాంబినేషన్స్ లో 'సింహ, లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.
అందుకే మరోసారి బాలయ్యతో సినిమా చేసి హిట్ కొట్టాలనే కోరికతో బోయపాటి ఉన్నాడు. అందుకే బాలయ్యకు ఒక పవర్ ఫుల్ కథ రెడీ చేశానని, వచ్చే సంవత్సరం మే లేదా జూన్ లో ఆ సినిమా ప్రారంభమవుతుందని తెలియజేశాడు. మరి ఈ మూడు ప్రాజెక్టులు గనక పట్టాలెక్కితే .... బోయపాటి డైరీ మరో మూడేళ్లపాటు ఫుల్ అయినట్లే.