మొత్తానికి ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌ని సద్వినియోగం చేసుకునేందుకు మూడు చిత్రాలు రంగంలోకి దిగడం ఖాయమైపోయింది. ఒక రోజు ముందుగా వస్తుందని ప్రచారం జరిగిన బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ల 'జయ జానకి నాయక' కూడా 11నే విడుదల కానుంది. అఫీషియల్‌గా డేట్స్ ఇచ్చేశారు. ఇక ఈ మూడు చిత్రాల కంటెంట్‌పై ముగ్గురు ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నా ప్రేక్షకులు ఎవరో నాకు తెలుసు. నా చిత్రం 40కోట్లు వసూలు చేస్తుంది. నాకు మిగిలిన ఏ చిత్రాలు పోటీ కాదని బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించాడు.
ఇక ఎంతో నమ్మకంతో 'నేనే రాజు నేనే మంత్రి' చేశామని, ఈ చిత్రం కాన్సెప్ట్‌పై ఎంతో నమ్మకం ఉందని, ఈ చిత్రంతో రానా దగ్గుబాటి టాప్‌లీగ్‌లోకి అడుగుపెడతాడని దర్శకుడు తేజతో పాటు సురేష్‌బాబు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మరోవైపు నితిన్ 'లై' చిత్రం ఖచ్చితంగా ఆయన కెరీర్‌లోనే పెద్ద హిట్టవుతుందని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఆగష్టు11న లాంగ్ వీకెండ్ అయినా ఓవర్‌సీస్‌లో మాత్రం అది ఉండదు. నేడు చిన్న చిత్రాలకు, వైవిధ్యభరితమైన చిత్రాలకు ఓవర్‌సీస్ మార్కెట్ కల్పవృక్షంలా మారింది. అక్కడ బోయపాటి శ్రీను తీసే.. యాక్షన్ అండ్ మాస్ చిత్రాలను పెద్దగా ఆదరించరు. కానీ ఈసారి కాస్త క్లాస్ కూడా బోయపాటి ట్రై చేశాడు కాబట్టి ఓవర్సీస్ లో కూడా జయ జానకి నాయక కి మంచి గ్రిప్ దొరకవచ్చు.
అలాగే నితిన్ 'లై'తో పాటు రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాయి. మరోవైపు రానా చిత్రానికి కోలీవుడ్ మార్కెట్ కూడా ప్లస్ కానుంది. రెండేళ్ల నుంచి సంక్రాంతికి వస్తున్న మూడు నాలుగు చిత్రాలు కూడా మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. ఈ సంక్రాంతికి వచ్చిన 'ఖైదీనెంబర్150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి' వంటి మూడు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లను సాధించాయి. దాంతో ఈసారి ఈ మూడు చిత్రాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్లను రాబడుతాయనే ఆశతో అందరూ ఉన్నారు.