నటునిగా మంచి టాలెంట్ వున్నా కూడా 'వెంకట్రాది ఎక్స్‌ప్రెస్' మినహా మరో హిట్ లేని హీరో సందీప్‌కిషన్. తనకు కృష్ణవంశీ మంచి బ్రేక్‌నిస్తాడని దాదాపు రెండేళ్లపాటు నానా కష్టాలు పడి 'నక్షత్రం' సినిమా చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఆయన 'మానగరం'తో కోలీవుడ్‌కి పరిచయమై అక్కడ మంచి మార్కులే సాధించాడు. తాజాగా ఆయన సౌతిండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్‌మీనన్ నిర్మాతగా, 'డి 16' చిత్రానికి దర్శకత్వం వహించిన కుర్రాడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరగాసురన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సందీప్‌కిషన్‌తో పాటు అరవింద్‌స్వామి, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నారు.
డార్క్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతోంది. ఈచిత్రానికి ఆల్‌రెడీ తెలుగులో 'నరకాసురుడు' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో సందీప్‌కిషన్ డెడికేషన్‌కి, టాలెంట్‌కు, కష్టపడే తత్వానికి ఫిదా అయిన గౌతమ్‌మీనన్ ఈయనతోనే మరో చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించాలని భావిస్తున్నాడు.
వాస్తవానికి ఈ కార్తీక్ నరేన్ 'నరకాసురుడు' చిత్రం రానా దగ్గుబాటి, నాగచైతన్యల చేతిలో నుంచి వెళ్లి సందీప్‌కిషన్ వద్ద నిలిచింది. మరి ఈచిత్రం ద్వారా సందీప్‌కిషన్ బ్రేక్ అందుకుంటాడా? నాగచైతన్య,రానాలు ఈ చిత్రం ఎందుకు వదిలేశారు? వంటివి చిత్రం విడుదలైతే కానీ తెలియదు.