Advertisementt

విడాకులైనా..ఈ జంటకి అది కామనే..!

Wed 09th Aug 2017 06:57 PM
malaika arora,arbaaz khan,divorce  విడాకులైనా..ఈ జంటకి అది కామనే..!
Malaika Arora Talks about Relationship with Arbaaz Khan విడాకులైనా..ఈ జంటకి అది కామనే..!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు విడాకులు తీసుకుని విడిపోయినా.... మళ్ళీ ఆ జంటలు కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ పబ్లిక్ గానే తిరుగుతున్నారు. అందులోను ఈ కల్చర్ మనకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనబడుతుంది. బాలీవుడ్ జంటలు విడిపోయి విడాకులు తీసుకున్నప్పటికీ వారు చాలా చోట్ల కలిసే కనబడుతున్నారు. అందులోనూ హ్రితిక్ రోషన్ జంట అయితే మరీను. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ... వారిద్దరికీ పొసగక వారు విడాకులు తీసుకుని దూరమైనా పిల్లల కోసం మాత్రం కలిసి వెకేషన్స్ కి వెళుతూ తరుచు కలిసే తిరుగుతున్నారు.

అలాగే మరో బాలీవుడ్ జంట తాజాగా విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తీసుకున్నప్పటికీ ఒకరింటికి ఒకరెళ్ళడం దగ్గరనుండి ఇద్దరూ కలిసి ఫంక్షన్స్ కి ట్రిప్పులకి కూడా వెళుతున్నారు. వారెవరో కాదు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ అయన భార్య మలైకా అరోరా. వారిద్దరూ ఆఫీసియల్ గా విడాకులు తీసేసుకున్నారు. ఇక విడాకులు తీసుకున్నాక మలైకా అయితే హాట్ హాట్ గా రెచ్చిపోతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది. అయితే భర్త అర్భాజ్ తో విడాకులు తీసుకుని కావాల్సినంత భరణం పొందిన మలైకా ఆ డబ్బుతోనే ఇలా ఎంజాయ్ చేస్తుందనే టాక్ ఉంది.

అలాగే విడాకులైన భర్త ఫ్యామిలీతో బాగా కలిసిపోతుందని... అటు అర్భాజ్ ఖాన్ కూడా మలైకా ఫ్యామిలిలో సభ్యుడిగా ఉండడం చూసిన చాలామందికి చాలానే డౌట్స్ వచ్చేస్తున్నాయి. అయితే ఆ డౌట్స్ ని మలైకా క్లియర్ చేస్తుంది. మేం విడాకులు తీసుకున్నా కూడా.... అర్భాజ్ నా పిల్లాడికి తండ్రి. అంతేకాదు నా చెల్లి అమ్రితకు ఒక అన్నయ్య లాంటివాడు. ఇక నా తల్లిదండ్రులకు ఒక కొడుకు. ఇప్పుడు మేం విడిపోయాం కదా అని అక్కడ ఫ్యామిలీ సమీకరణాలను మార్చలేం కాదా. ఎప్పటికీ అర్భాజ్ ఫ్యామిలీలో నేను.. మా ఫ్యామిలీలో అర్బాజ్ ఉంటాం. కాకపోతే మేం ఇలా విడాకులు తీసుకుని విడిపోవడం అనేది బాధాకరమే. కాని మేమెందుకు విడిపోయి విడాకులు తీసుకున్నామనేది ....  మాకు మాత్రమే తెలుసు అంటూ ఫుల్ క్లారిటీ ఇస్తుంది.

Malaika Arora Talks about Relationship with Arbaaz Khan:

Malaika Arora for the first time has opened up on her divorce with ex-husband Arbaaz Khan.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ