Advertisementt

ఈ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు..!

Wed 09th Aug 2017 01:48 PM
hero nikhil,nikhil engagement with tejaswini,engagement on august 24th  ఈ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు..!
Hero Nikhil Engagement Will be Held on August 24th ఈ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు..!
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్ వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. 'హ్యాపీ డేస్' తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ మధ్యలో కొన్ని సినిమాల ఫలితం నిరాశ పరిచినప్పటికీ.... ఆ తర్వాత మంచి మంచి కథలను, డైరెక్టర్స్ ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే నిఖిల్ ఇప్పటివరకు సినిమాలపైనా శ్రద్ద పెట్టాడు కానీ పెళ్ళి వైపు ఆలోచన చెయ్యలేదు. కాకపోతే తనతో పాటు ఎక్కువ సినిమాల్లో నటించిన కలర్స్ స్వాతితో ప్రేమాయణం నడుపుతున్నాడనే ప్రచారం జరిగినప్పటికీ వాటిని నిఖిల్ కొట్టిపడేశాడు.

అయితే తాను ప్రేమ వివాహం చేసుకోనని... పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెబుతున్న నిఖిల్ ఇపుడు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నిఖిల్  హైదారాబాద్ కు చెందిన ఆంజనేయులు అనే బిజినెస్ మ్యాన్ కూతురు తేజస్వినిని పెళ్లాడబోతున్నాడని చెబుతున్నారు. ఈ మధ్యనే తేజస్విని ఇంజీనిరంగ్ పూర్తి చేసిందట. ఇక ఈ అమ్మాయి నిఖిల్ కు దగ్గర బంధువు కూడానట. నిఖిల్ - తేజస్విని ల ఎంగేజ్మెంట్ ఈ నెల 24న హైదారబాదులో ఒక స్టార్ హోటల్ లో జరగబోతున్నట్టు చెబుతున్నారు. 

అలాగే నిఖిల్, తేజస్వినిల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 1న నిఖిల్ పెళ్లిని తేజస్వినితో అంగరంగ వైభవంగా వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారట. ఇక ఈ నెల 24న జరగబోయే ఎంగేజ్మెంట్ కి ఇండస్ట్రీలోని కొంతమందిని నిఖిల్ ఆహ్వానిస్తాడనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం నిఖిల్ కన్నడ సినిమా 'కిరాక్ పార్టీ' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా మరొక్క నెలలోనే పూర్తికానుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే నిఖిల్ పెళ్లి పీటలెక్కుతాడన్నమాట.

Hero Nikhil Engagement Will be Held on August 24th:

Hero Nikhil engagement with Tejaswini, a Hyderabadi girl and the older daughter of businessman Anjaneyulu Yadav.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ