దాదాపు 10, 12 ఏళ్లుగా హిట్ లేని తేజ చివరి చిత్రం 'హోరాహోరి' డిజాస్టర్. ఆ తర్వాత ఆయన రాజశేఖర్ హీరోగా 'అహం'అనే చిత్రం ప్లాన్ చేశాడు. కానీ రాజశేఖర్ పలు సీన్స్‌ని మార్చమని చెప్పడం, ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చి ఈ 'అహం'వారి వారి అహాల వల్ల ఆగిపోయింది. అదే చిత్రం కథను ఆయన రానాకు, సురేష్‌బాబుకి చెప్పి వారు చెప్పిన కొన్ని మార్పులు చేసిన తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' పేరుతో తీశారు.
ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ విషయాన్ని సురేష్‌బాబునే చెప్పాడు. రాజశేఖర్ పేరు ప్రస్తావించకుండా తేజ 'అహం' అనే కథతో తన వద్దకు వచ్చాడని, దానినే మార్పులు చేర్పులు చేసి 'నేనే రాజు.. నేనే మంత్రి' చేశామని తెలిపాడు. ఇక ఫేడవుట్ అయినా రాజశేఖర్ కన్నా నేడు మంచి స్థితిలో, పలు భాషల్లో క్రేజ్ ఉన్న రానాతో చేయడం వల్ల ఇది తేజకు ప్లసే అవుతుందని భావించాలి. అలా అదృష్టం తేజని వరించింది. ఇక చిరంజీవి 'ఖైదీ'చిత్రంలాగా తన కుమారుడు రానాని హీరోగా పరిచయం చేయాలని భావించానని, కానీ శేఖర్‌కమ్ముల 'లీడర్' తో వచ్చాడని, 'లీడర్'ని వెంకటేష్‌తో చేయమని తాను చెప్పినా శేఖర్‌కమ్ముల మాత్రం రానానే చేయాలని పట్టుబట్టినట్లు చెప్పుకొచ్చాడు.
మొత్తానికి చిత్రం బాగా వచ్చింది.. ఇదో కమల్ హాసన్ 'నాయకుడు', 'గాడ్‌ఫాదర్' తరహాలో అద్భుతంగా ఉంటుందని, ఇది ఓట్రెండ్‌సెట్టర్‌గా సురేష్‌బాబు ముందుగానే చెప్పేశాడు. తన కొడుకును పెట్టి 'నేనే రాజు... నేనే మంత్రి' సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. మరి సురేష్‌బాబు జోశ్యం ఈమద్య బాగా వమ్ము అవుతూ వస్తున్నాయి. 'భీమవరం బుల్లోడి'ది మరీ దారుణం, మరి ఈ చిత్రమైనా సురేష్‌బాబు నమ్కకాన్ని వమ్ము చేయదని భావిద్దాం.