'దేనికైనా రెడీ, ఈడోరకం.. వాడోరకం' చిత్రాల తర్వాత మంచు విష్ణు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర', ఈ చిత్రంలో ఈ ఇద్దరు హ్యాట్రిక్ కొడతారనే నమ్మకం వ్యక్తమవుతోంది. రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం యూనిట్ మలేషియా వెళ్లింది. ఓ సన్నివేశంలో మంచు విష్ణు బైక్ నడుపుతుండగా, బైక్ స్కిడ్ అయి మంచు విష్ణుకి గాయాలయ్యాయి.
ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ప్రమాదం లేదని చెప్పారు. త్వరలో కోలుకుంటాడని భరోసా ఇచ్చాడు. అనుకున్నట్లుగానే విష్ణు కోలుకుంటున్నాడు. దీంతో తన గురించి ఆందోళన చెందవద్దని ఆయన ట్వీట్ చేశాడు. ఎంతో మంది తాను గాయపడిన తర్వాత తన కోసం ఫోన్లు చేశరని, తాను చేసిన ఓ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, దాంతో తాను తన తల్లిదండ్రులను, పిన్నిని, సోదరిని, సోదరుడిని, అభిమానులను, తన సన్నిహితులను బాధపెట్టానని, వారందరికీ సారీ చెప్పాల్సిన బాధ్యత తనపై ఉండటంతో ఈ ట్వీట్ చేస్తున్నానని తెలిపాడు.
తన స్నేహితులను, శ్రేయోభిలాషులను క్షమించమని వేడుకుంటున్నానని, అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రమాదం ఎలా జరిగింది? వంటి విషయాలను తన వద్ద ఉన్న వీడియో ఫుటేజ్‌ని రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేస్తానని చెప్పాడు. నేను మరలా అందరి ముందు ఇలా మాట్లాడుతున్నానంటే అది దేవుని దయే కారణమని ఆయన ట్వీట్ చేశాడు.