చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత తన 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్ 150'లో అవకాశం కోసం ఎందరో కళ్లుకాయలు కాసేలా ఎదురుచూశారు. కనీసం తళుక్కున మెరిసే పాత్రనయినా ఇవ్వమని కోరారు. అలాంటి చిత్రంలో ఐటంసాంగ్‌కి మొదట క్యాధరిన్ ఎంపికైంది. దాంతో అందరూ ఆమె అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారు. కానీ సడన్‌గా ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు. ఆ చిత్రానికి కాస్ట్మూమ్ డిజైనర్‌గా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో వచ్చిన విభేదాల కారణంగానే ఈ చిత్రం నుంచి క్యాధరిన్‌ని తప్పించారని నాడు వార్తలు హల్‌చల్ చేశాయి.
కాగా ప్రస్తుతం క్యాధరిన్ బిజీగా ఉంది. ఆమె నటించిన 'జయ జానకి నాయక', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు ఒకేసారి విడుదల కానున్నాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 'ఖైదీనెంబర్ 150' నుంచి ఎందుకు బయటకు వచ్చారు? అనే ప్రశ్నకు తెలివిగా సమాధానం దాటేసింది. నేను ఆ విషయం గురించి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు. ఈ విషయంపై అసలు నేను మాట్లాడదల్చుకోలేదు. ఈ విషయాన్ని నన్నుకాదు.. 'ఖైదీనెంబర్ 150' యూనిట్‌ని అడగమని చెప్పింది.
మీరు చిరంజీవి కుమార్తె సుస్మితతో కాస్ట్యూమ్స్ విషయంలో గొడవ పడ్డారా? అన్న ప్రశ్నకు అవునని గానీ లేదని కానీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఇక ఎందుకు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చానో ఆ చిత్రం యూనిట్‌నే అడగమని చెప్పడంతో ఆమె అంతట ఆమె బయటకు రాలేదని, తప్పు తనది కాదని తెలివిగా సమాధానం ఇచ్చిందని భావించాలి. ఇక సుస్మితతో కాస్టూమ్స్ విషయంలో గొడవ పడటం గూర్చి మౌనంగా ఉన్నదంటే ఈ గొడవ నిజమేనని భావించాల్సివస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.