యంగ్‌హీరోలలో నితిన్ దాదాపు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇప్పుడున్న యంగ్‌హీరోలలో ఈయనే సీనియర్ కావడమే కాదు... రాజమౌళి, వినాయక్, తేజ, త్రివిక్రమ్‌శ్రీనివాస్, కృష్ణవంశీ వంటి ఎందరో దర్శకులతో పనిచేశాడు.ఆయన నటించిన కిందటి చిత్రం 'ఆ..ఆ' 50కోట్ల క్లబ్‌లో చేరినా ఆ క్రెడిట్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంతల ఖాతాలో పడింది. దాదాపు 12ఏళ్ల పాటు విజయాలు లేక 'ఇష్క్'తో రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టిన నితిన్ తాజాగా 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మాతలుగా చేస్తున్న 'లై' చిత్రం ఆయన కెరీర్‌కి ఎంతో కీలకం కానుంది.
ఇక ఇందులో మేఘా ఆకాష్ అనే నూతన నటి నటిస్తుండగా, 'అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రాల దర్శకుడు, మోస్ట్ టాలెంటెండ్ దర్శకునిగా గుర్తింపు పొందిన యువ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అమెరికాలో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో పాతబస్తీ యువకునిగా, గుబురు గెడ్డంతో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్న నితిన్‌ని చూస్తే పాతబస్తీకి, అమెరికాకు ఉన్నలింక్‌తో పాటు ఇదేదో మాఫియా నేపద్యంలో సాగే చిత్రంగా కొందరు భావిస్తున్నారు.
ఇక ఇందులో యాక్షన్‌కింగ్ అర్జున్ కూడా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం 'లై'లోని 'ఎల్' అంటే లవ్, 'ఐ' అంటే ఇంటెలిజెన్స్, 'ఇ' అంటే ఎనిమిటి అంటున్నారు. ఇక ఇంటెలిజెన్స్‌కి సింబల్‌గా యాక్షన్‌కింగ్ అర్జున్‌ని చూపించడంతో ఆయన ఇందులో విలన్ కాదని, పోలీసు ఆఫీసర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఇక తన ఇతి వృత్తాలలోనే సామాజిక అంశాలను మిళితం చేయడం హనుకి అలవాటే. ఇక ఈ చిత్రం 50కోట్ల మార్కుని సాధిస్తే మాత్రం మొత్తం క్రెడిట్ నితిన్‌కి దక్కుతుంది. మరి 'లై' ద్వారా నితిన్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది..!