బిగ్‌బాస్ రియాల్టీషోకి పార్టిసిపెంట్స్ మాత్రమే కనిపించే వీక్ డేస్‌లలో కంటే హోస్ట్ ఎన్టీఆర్ కనిపించే వీకెండ్ డేస్‌లోనే వీక్షకుల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంటోంది. ఇక 'బిగ్‌బాస్' షోలో ఎవరో ఒకరు విన్ అవుతారని తెలిసినా, ప్రైజ్‌మనీ ఇస్తారనే విషయం స్పష్టమైనా కూడా ఆ మొత్తం ఎంత అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంది. షో నిర్వాహకులు కానీ, ఎన్టీఆర్ గానీ ఈ విషయంలో ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు.
ఎట్టకేలకు ఈ షోలో గెలిచిన వారికి 50లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో పార్టిసిపెంట్స్‌లో నూతనోత్తేయం వచ్చింది. వీటిని గెలిస్తే ఏం చేస్తారని బిగ్‌బాస్ అడిగితే, సొంత ఇల్లు కొంటామని కొందరు, అమ్మచేతిలో పెడతామని కొందరు, పెట్టుబడుల్లో పెడుతామని కొందరు చెప్పారు. బిగ్‌బాస్ పోటీదారు కత్తి కార్తిక బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది.
అందరికీ రాఖీ కట్టి ఆశీర్వాదాలు పొందింది. అదే సమయంలో ప్రతి ఏడాది తాను తన ఇంట్లో చేసుకునే రాఖీ సెలబ్రేషన్స్‌ని, ప్రస్తుతం తన సోదరులకు దూరంగా ఒంటరిగా ఉండటాన్ని తలచుకుని ఆమె కాస్త భావోద్వేగానికి లోనై ఏడ్చేసింది. ఈ వారం మొత్తం ఆరుమంది ఎలిమినేషన్స్‌కి ఎంపికైన సంగతి తెలిసిందే. ధన్‌రాజ్, సమీర్, కల్పన, కత్తి మహేష్, శివబాలాజీ, ముమైత్‌ఖాన్‌లు ఉన్నారు. ధన్‌రాజ్, శివబాలాజీ, కత్తి మహేష్‌కి వీక్షుల ఓటింగ్ ద్వారా సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు.
ఇక మిగిలిన సమీర్, ముమైత్‌ఖాన్, కల్పనలలో ఎవరు ఫైనల్‌గా ఎలిమినేట్ అవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఆదివారం ప్రకటిస్తామని బిగ్‌బాస్ ఎన్టీఆర్ ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తినెలకొని ఉంది.