ఈ టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్' కామెడీ షో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది అవ్వడానికి కామెడీ షో అయినా..యాంకర్లు వేసుకుని వచ్చే డ్రస్సులతో ఇది ఎక్స్‌పోజింగ్ షో గా కూడా వార్తలు వచ్చాయి. ఈ షో ఇంతగా పాపులర్ అవ్వడానికి కామెడీతో పాటు యాంకర్లు హాట్ షో కూడా కారణమని చాలా మంది అనుకునేదే.
అయితే ఉన్నట్టుండి ఏమయిందో తెలియదు కానీ..ఈ మధ్య యాంకర్ల డ్రస్సుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కాస్త నిండు డ్రస్సులతో కనిపిస్తూ..హాట్ షోని తగ్గించారు. దీనికి కారణం మాత్రం ఈ మధ్య బ్రతుకు జట్కాబండి, సంసారం ఒక చదరంగం, రచ్చబండ వంటి వాటిపై వచ్చిన వ్యతిరేకతే అని మాత్రం తెలుస్తుంది. ఈ కార్యక్రమాలపై రీసెంట్‌గా ఎటువంటి చర్చ జరిగిందో తెలిసిందే. సదరు ఛానెళ్లు ఆయా కార్యక్రమాలను తీసేసి ఆ ప్లేస్‌లో సినిమాలను ప్లే చేస్తున్నారు. అదే టైమ్‌లో ఈ 'జబర్ధస్త్' పై కూడా ఘాటుగానే వ్యాఖ్యలు వినిపించాయి.
ఈ వ్యాఖ్యలకు 'జబర్ధస్త్' అలర్ట్ అయినట్లుంది. యాంకర్లు అనసూయ, రష్మిలు నిండైన దుస్తుల్లో కనిపిస్తూ..అతి కూడా తగ్గించారు. అలాగే స్కిట్‌లలో కూడా కాస్తంత ఛేంజ్ కనిపిస్తుంది. ఈ మార్పు మంచికే అయితే మంచిదే. ఏదో బయట గొడవ చేస్తున్నారని ఒక నెల పాటు కామ్‌గా ఉండి మళ్ళీ మాములే అయితే..మాత్రం ఈసారి డైరెక్ట్‌గానే దెబ్బపడే అవకాశం ఉంది. రేటింగ్‌ల కోసం కాకుండా రచ్చ జరగకుండా ఈ షో న్యాయనిర్ణేతలుగా ఉన్న నాగబాబు, రోజాలు కూడా దీనిపై కాస్త మనసు పెడితే బాగుంటుంది మరి.