తెలుగులో అత్యధిక వ్యయంతో రూపొందిన 'బాహుబలి' చిత్రం ఎంత లాభాలను తెచ్చిందో తాజాగా దిల్‌రాజు - శేఖర్ కమ్ముల- వరుణ్ తేజ్‌ల 'ఫిదా' కూడా అంతే లాభాలను తీసుకొస్తోంది. విడుదలైన మూడే మూడు రోజుల్లోనే ఈ చిత్రం బడ్జెట్ అయినా 15కోట్లను రాబట్టి లాభంగా 10కోట్లతో 25 కోట్లు వసూలు చేయడం చిన్న విషయం కాదు. ఇక ఈ చిత్రం ఆల్‌రెడీ 50కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయి బయ్యర్లను, నిర్మాతను కాసుల వర్షంతో తడిపేస్తోంది.
ఇక ఈ సినిమాకు గుండెకాయ సాయి పల్లవి అని స్వయంగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజులే కాదు.. మెగాహీరో 'ఫిదా'లో నటించిన వరుణ్ తేజ్ కూడాఒప్పుకున్నాడు.ఇక తాజాగా ఈ చిత్రం చూసిన పవన్ కళ్యాణ్ కూడా తన సన్నిహితుల వద్ద ఇదే మాట అన్నాడట. ఈ చిత్రం తర్వాత ఆమె నాగశౌర్యతో నటించనున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇక ఆమె వరుసగా మూడు చిత్రాలలో నటించేందుకు దిల్‌రాజుకి అగ్రిమెంట్ రాసి ఇచ్చిందట. తెలుగు దర్శకనిర్మాతల, హీరోల నుంచి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన సాయి పల్లవి కోసం అందరూ క్యూలలో ఉంటే ఆమె ఏకంగా మూడు చిత్రాలను దిల్‌రాజుకి ఇవ్వడం ఆశ్చర్యం వేస్తోంది.
కానీ దిల్‌రాజు తన గాడ్‌ఫాదర్ అని, అందుకే ఆయనకు వరుసగా మూడు చిత్రాలు చేస్తున్నానని తెలిపింది. ఇక 'ఫిదా' విడుదల కాగా నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'ఎంసీఏ' రెండో చిత్రం అవుతుంది. మరి మూడో చిత్రంగా మహేష్‌బాబు -దిల్‌రాజు- అశ్వనీదత్‌ల సినిమా చేస్తుందా? లేక ఈలోపే దిల్‌రాజు నిర్మించే మరో చిత్రంలో నటిస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ఇక 'ఫిదా'ని కూడా మలయాళంలో డబ్ చేయడానికి పలువురు మలయాళ నిర్మాతలు పోటీ పడుతున్నారు.
'ఫిదా' చిత్రం ముందు కూడా ఆమె దిల్‌రాజుకి, శేఖర్ కమ్ములకి ఆమె ఎన్నో కండీషన్స్ పెట్టిందట. స్క్రిప్ట్‌లో ఉన్నట్లే నా పాత్ర ఉండాలి... అనవసరమైన ఎడిటింగ్‌లతో తన పాత్ర తగ్గించకూడదు. గ్లామర్‌షో చేయను.. ఇలా అనేక కండీషన్స్ పెట్టినా ఆమె మీద ఉన్న నమ్మకంతో దిల్‌రాజు అంగీకరించాడు. ఆయన నమ్మకాన్ని ఈమె మరింతగా నిలబెట్టింది..!