'అ, ఆ, ప్రేమమ్, శతమానం భవతి'లతో మొదటి మూడు చిత్రాలతోనే హ్యాట్రిక్ కొట్టిన నటి మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. కానీ ఈమె ప్రతిభకు సరిపడా చాన్స్‌లు రావడం లేదు. ఆమెకు ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ', రామ్ చరణ్-సుకుమార్‌ల 'రంగస్థలం 1985', నాని తాజా హిట్ 'నిన్నుకోరి' చిత్రాలలో అవకాశాలు చేతి దాకా వచ్చి పోయాయి. ఆమె ఆన్‌స్క్రీన్ గ్లామర్ చూపించడంలో కండీషన్ పెడుతుందనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి.
మరి అలాగే కండీషన్స్ పెట్టిన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, సాయి పల్లవిలకి మాత్రం చాన్స్‌లు వస్తున్నాయి. దాంతో ఈమెకు అవకాశాలు రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఇండస్ట్రీ అంటోంది. ఆ విమర్శలను పక్కనపెడితే నిన్నటి నిత్యామీనన్ తరహాలోనే కేవలం పొడవుగా లేదు కాబట్టే ఆమెను పలువురు దర్శనిర్మాతలు, హీరోలు పక్కనపెడుతున్నారట. నాడు బాలకృష్ణ సైతం సౌందర్య మరణించాక 'నర్తనశాల' ఆపేశానని, నిత్యా మీనన్ కాస్త హైట్ ఉండి ఉంటే తాను ద్రౌపది పాత్రను ఇచ్చేవాడినని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇక అనుపమ పరమేశ్వరన్ తానే స్వయంగా కొందరు దర్శకనిర్మాతలు అడిగినా వారు మొహం మీదనే ఆ హీరోకి తగ్గ హైట్ నీకు లేదు. సారీ.. అని చెప్పేశారట. దాంతో హర్ట్ అయిన ఈ భామ తానంతట తాను ఎవ్వరినీ చాన్స్‌లు ఆడగనని, తన వద్దకు వచ్చి అడిగితే గానీ చేయనని అంటోంది. ఆన్ స్క్రీన్ సంగతేమీ గానీ ఆఫ్‌స్క్రీన్‌లో మాత్రం అమ్మడు సంప్రదాయ బద్దంగా చీర కట్టుకుని వస్తున్నా, ఆ చీరలనే తన సరికొత్త అందాలను, చూపించి, చూపించని విధంగా ఆమె అందాలతో కవ్విస్తూ చీరలోని సెక్సీనెస్‌ని చూపిస్తోంది.
ఇక రామ్ చరణ్ -సుకుమార్‌ల చిత్రం 'రంగస్థలం 1985'లో ఆమె మెయిన్ హీరోయిన్‌గా ఎంపికై రెండు రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొంది. తర్వాత సమంత ఆ స్థానంలో వచ్చి చేరింది. అయినా ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఆ చిత్ర హీరో, దర్శకనిర్మాతలు మంచి వారని చెబుతూ తన మంచితనాన్ని చాటుకుంది. ఏదో కలరూ, గ్లామర్ అయితే పెంచమంటే పెంచవచ్చని, కానీ తన చేతుల్లో లేని హైట్ విషయంలో అభ్యంతరం చేస్తే తాను ఏమి చేయగలనని ఆమె ప్రశ్నిస్తోంది.
ఇక జయబాధురి అంత పొట్టిగా ఉన్నా కూడా ఆమె ఎంతో హైట్‌గా ఉండే అమితాబ్‌తో హిట్ పెయిర్ అనిపించుకోలేదా? కేవలం ఇది ఒక సాకు మాత్రమేనని లోపల విషయం ఏదో ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.