నేడు పేరున్న ప్రతి నిర్మాత తమ ఇంట్లోనే ఓ యాక్షన్ హీరో ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే రానా, రామ్, సుకుమార్ అన్నకొడుకు అశోక్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, త్వరలో రాజ్‌కందుకూరి కుమారుడు శివ కందుకూరి, సుమంత్ అశ్విన్.. ఇలా తయారై వస్తున్నారు. ఇక ఈ హీరోలకు బ్రేక్ ఇవ్వడం కోసం వారితో కష్టనష్టాలు భరించి వారిని హీరోలుగా నిలబెడుతున్నారు తండ్రులైన నిర్మాతలు. మరి దానికి ఎంత తండ్రైనా, కొడుకైనా ఒక్కటే కదా...! ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆయా హీరోలు పెద్దయిన తర్వాత నిర్మాతలు తమ సత్తా చూపుతున్నారు.
వారి కెరీర్ బిగినింగ్‌లో పెట్టిన పెట్టుబడిని వారు స్టార్స్ అయ్యాక వాడేసుకుంటున్నారు. ఎంతైనా తండ్రే కదా..! ఆయన సంపాదించేది కుమారుడి కోసమే కదా.! అనే వారుంటారు. కానీ ఓ నిర్మాతకు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నప్పుడు అది తప్పనిసరి. గోదావరిలో వేసినా డబ్బు లెక్క బెట్టి వేయాలనే సామెత అందుకే వచ్చింది. ఇక ఇటీవల 'సరైనోడు' సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రం బాగా లాభాలు తెచ్చినా తనకు తన తండ్రి పైసా పారితోషికం ఇవ్వలేదని జోక్ చేశాడు.
తాజాగా రానాకు 'నేనే రాజు నేనే మంత్రి'కి గాను ఆయన తండ్రి సురేష్‌బాబు పదిపైసలు కూడా ఇవ్వలేదని చెప్పాడు. అడగచ్చు కదా..! అంటే ఆయన ఇంట్లో ఉంటూనే ఇలా అడిగితే తాను తిండి పెట్టడం, గుడ్డలు కొనివ్వడం కూడా చేయడని బదులిచ్చాడు. ఇది జోక్‌గా చెప్పుకున్నా లోతైన విషయమే. చిరు తన కుమారుడు చరణ్‌కి ఫ్రీగా 'ఖైదీనెంబర్ 150' చేశాడు. 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' చేస్తున్నాడు.బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, తమిళంలో ధనుష్ కూడా తన మామతో చేసే 'కాలా' చిత్రానికి రజినీ పైసా కూడా తీసుకోవడం లేదట.