Advertisementt

మెగా బ్రదర్‌ని ఈ స్టార్‌ అయినా కాపాడుతాడా?

Fri 04th Aug 2017 02:56 PM
naga babu,varun tej,allu arjun,fidaa movie,naa peru suriya naa illu india movie  మెగా బ్రదర్‌ని ఈ స్టార్‌ అయినా కాపాడుతాడా?
Nagendra Babu in Naa Peru Suriya Naa Illu India Movie మెగా బ్రదర్‌ని ఈ స్టార్‌ అయినా కాపాడుతాడా?
Advertisement
Ads by CJ

తానే సొంతగా తన తల్లి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్‌ను స్థాపించి, అభిరుచి కలిగిన చిత్రాలను నిర్మించిన వ్యక్తి మెగాబ్రదర్‌ నాగబాబు. 'రుద్రవీణ, ముగ్గురు మొనగాళ్లు, గుడుంబా శంకర్‌, ఆరెంజ్‌'తో పాటు తనకిష్టమైన బాపుతో చిత్రం తీసినా ఆయన కెరీర్‌లో లాభాలను తెచ్చిన చిత్రం మాత్రం కేవలం 'బావగారూ.. బాగున్నారా' మాత్రమే. అవార్డులైతే వచ్చాయి కానీ ఏచిత్రం కూడా ఆయనకు కమర్షియల్‌ సక్సెస్‌ని ఇవ్వలేదు. 

ఇక 'ఆరెంజ్‌'తో ఆయన ఆర్ధికంగా చితికిపోయి ఇక సినిమాలు తీయనని చెప్పాడు. తన సోదరులు సహాయం చేశారని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని భావించానని, కానీ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లకి చెడ్డపేరు వస్తుందని ఆగానని ఆయన చెప్పాడు. ఇక ఆయన టీవీ సీరియల్స్‌తో పాటు 'జబర్దస్త్‌' వంటి షోలకు జడ్జిగా పాల్గొంటూ తాను తన డబ్బుతానే సంపాదించాలని, వేరే వారి మీద ఆధారపడకూడదని నిర్ణయించుకున్నట్లు నాడే చెప్పాడు. మెగాబ్రదర్‌ని అనే అహం లేకుండా పాజిటివ్‌ ఆలోచన ఉండే వాడిగా ఇటీవల అల్లు అరవింద్‌ కూడా ఆయన్ను మెచ్చుకున్నాడు.

ఇక నిహారిక సంగతి ఎలా ఉన్నా. వరుణ్‌ తేజ్‌ తాజా సక్సెస్‌తో 'ఫిదా'తో ఆయనకు తన కుమారుడి రూపంలో తోడు దొరికింది. నాడు వరుణ్‌తేజ్‌ కూడా తన షూటింగ్‌ ప్రారంభోత్సవాలకు అందరూ ఖరీదైన కార్లలో వస్తుంటే తన తండ్రికి అంత విలువైన కారు లేదే అని బాధపడ్డాడు. మొత్తానికి ఇప్పుడు ఆయనకు బన్నీ రూపంలో తోడు లభించింది. మెగా ఫ్యామిలిలో విబేధాలు నిజంకాదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 

'రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు, డిజె'లతో బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన బన్నీ తన తాజా చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'లో అవకాశం ఇచ్చాడు. బన్నీ హీరోగా, అను ఇమ్మేన్యుయేల్‌ హీరోయిన్‌గా, రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శరత్‌ కుమార్‌లు నటిస్తుండటం విశేషం. ఇక 'టెంపర్‌, రేసుగుర్రం, కిక్‌' వంటి సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన స్టార్‌రైటర్‌ వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. 

ఈ చిత్రానికి నాగబాబు సమర్పకుడు కాగా, లగడపాటి శ్రీదర్‌, శిరీషలు నిర్మాతలు. శ్రీరామలక్ష్మి బేనర్‌ పై రూపొందనున్న ఈ చిత్రానికి బన్నీ వాసు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బన్నీ ఎనర్జీకి తగ్గట్లుగా, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపందుతోంది. తాజాగా ఈచిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా మొదలైంది. ఇందులో బన్నీ పవర్‌ ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయనున్నారు.మరి ఈ చిత్రంతో బన్నీ నాగబాబుకి ఎంతగా సాయపడుతాడో వేచిచూడాల్సివుంది...! 

Nagendra Babu in Naa Peru Suriya Naa Illu India Movie:

Mega Brother Naga Babu in Naa Peru Suriya Naa Illu India Movie hero Allu Arjun Director Vakkantham Vamsi, In this Movie Release on 27th April 2018.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ