హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్, ఆయన నటించిన 'ప్రేమకథ'కు వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఆయన కెరీర్‌లో 'సత్యం, గోదావరి, గౌరీ' మాత్రమే ఫర్వాలేదనిపించాయి. కానీ తనతో కలిసి ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలు స్టార్స్‌గా ఉంటే, అందం, నటన, పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న కూడా సుమంత్ కెరీర్ ఎదుగుబొదుగు లేకుండా ఉంది. ఇక ఆయనే తెరవెనుక పెట్టుబడి పెట్టిన 'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఎగరలేకపోయింది.
ఇక హిందీ 'విక్కీడోనర్'ని 'నరుడా డోనరుడా' అని రీమేక్ చేసినా అదే ఫలితం. ఈసారి మాత్రం సుమంత్ ఎలాంటి హడావుడి లేకుండా ఓ చిత్రం పూర్తిచేసి తాజాగా టీజర్‌ని కూడా విడుదల చేశాడు. ఈ చిత్రం టైటిల్ 'మళ్లీ రావా'. కొత్త దర్శకుడైన గౌతమ్ తిమ్మనూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈచిత్రం ఆకాంక్షసింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 13 ఏళ్ల తర్వాత స్నేహితురాలైన ఒక అమ్మాయిని తిరిగి కలిస్తే, చూసి కూడా చూడనట్లుగా వెళ్లిపోయింది.
గుర్తు పట్టలేదా? గుర్తు పెట్టుకోలేదా ? అనే ఈ టీజర్‌లోని ఈ డైలాగ్‌ని వింటే ఇది ఫీల్‌గుడ్ మూవీగా అనిపిస్తోంది. ఇక అక్కినేని వారసులలాగా సుమంత్‌కి మాస్ హీరో కంటే క్లాస్‌టచ్ ఉన్నచిత్రాలు, ఫీల్‌గుడ్ చిత్రాలే బాగా నచ్చుతాయి. మరి ఇలాంటి క్లాస్ కంటెంట్ ఉన్న చిత్రంతో సుమంత్ మరలా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిద్దాం....!