బాహుబలితో భళ్లాలదేవగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా త్వరలో జోగీంద్రగా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి'గా ఆగష్టు11న రానున్న సంగతి తెలిసిందే. రామానాయుడు సమర్పణలో తన తండ్రి సురేష్‌బాబు, బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, కేథరిన్‌లు హీరోయిన్లు. ఇక తాజాగా జోగేంద్ర యువగర్జన పేరుతో ఓ వేడుక చేశారు.
ఈ సందర్భంగా రానా స్పీచ్ బాగా ఆకట్టుకుంది. తనకు ఎన్టీఆర్, ఎంజీఆర్‌లు ఆదర్శమని, వారి ఐడియాలజీతోనే ఈచిత్రంలో తన పాత్ర జోగీంద్ర ఉంటుందని, అందుకే ఒప్పుకున్నానని తెలిపాడు. తేజ ఎవీఎం స్టూడియో ఫ్లోర్ కడిగే స్థాయి నుంచి, అక్కడే కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసి, ముంబై వెళ్లి, పెద్ద కెమెరామెన్ అయి మహేష్‌భట్, అమీర్‌ఖాన్‌లతో పని చేసి దర్శకుడయ్యాడని, ఆయన సినిమా అంటే పడి చస్తాడని, అంత గొప్పగా ఈ చిత్రాన్ని తీశాడని చెప్పాడు. ఇక తన తాత రామానాయుడు బతికుండగా ఆయన సినిమాలో నటించలేదనే లోటు ఉందని, కానీ ఆయన మరణం తర్వాత అన్నీ పాజిటివ్ సంఘటనే జరుగుతున్నాయని ఆయన పైనుంచి ఇస్తున్న దీవెనలే దానికి కారణమని భావిస్తున్నానన్నాడు.
ఇక సురేష్‌బాబు మాట్లాడుతూ, బాహుబలి తర్వాత ఈ చిత్రం ఓకే చేశాం. కథలంటే నాకుభయం. ఇక నా కుమారుడి కథలంటే ఇంకా భయం. మొత్తానికి సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపాడు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. రానా హైట్‌కి కాజల్ అయితే బాగుంటుందని పెట్టుకున్నాం. స్పెషల్ అట్రాక్షన్ కోసం కేథరిన్‌ని తీసుకున్నాం.. అని తెలిపాడు. ఇక కాజల్ మాట్లాడుతూ, ఇక రానా ఈ చిత్రం తర్వాత జోగీంద్రగా గుర్తుండిపోతాడని, తేజ తనకు గురువు అని పేర్కొంది. ఇక రానా తనకు బాబాయ్ వెంకటేష్ అభిమానుల ప్రోత్సాహం ఉంటుందని భావిస్తున్నానని, అది ఉంటే ఇక్కడి నుంచే హాలీవుడ్ చిత్రాలలో నటిస్తానని చెప్పడం హైలైట్. కాగా ఈమద్య రానాకి ఓ హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.