Advertisementt

మొత్తానికి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ భలే ఉంది!

Thu 03rd Aug 2017 11:45 PM
bigg boss,ntr,archana,hariteja,prince,deeksha panth,kiss,luxury budget  మొత్తానికి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ భలే ఉంది!
Bigg Boss Telugu - Prince Kisses Deeksha Panth మొత్తానికి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ భలే ఉంది!
Advertisement
Ads by CJ

'బిగ్‌బాస్‌' రియాల్టీ షో తెలుగువారికి కొత్త కావడం, బిగ్‌ బాస్‌ ఇచ్చే చాలెంజ్‌లు, టాస్క్‌లు రంజుగా ఉండటంతో ఈ షో బాగానే అలరిస్తోంది. తాజాగా ఈ షోలో బిగ్‌బాస్‌ 'పైసావసూల్‌-లగ్జరీ బడ్జెట్‌' అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఇందులో ఆయన పార్టిసిపెంట్‌ను రెండుగా విడగొట్టి, యజమానుల టీంకి కొందరిని, వినియోగదారుల టీంగా మిగిలిన వారిని ఏర్పర్చాడు. యజమానులు టీం తిండి నుంచి డైనింగ్‌ టేబుల్‌ వరకు, చివరకు టాయిలెట్లకు కూడా తాము ఎంత అనుకుంటే అంత వినియోగదారుల టీం నుంచి వసూలు చేస్తారు. అదే సమయంలో వినియోగదారుల టీం జాగ్రత్తగా ఖర్చుపెట్టి, తమ వద్ద ఎక్కువ డబ్బును దాచుకున్నారా? లేక యజమానులే వినియోగదారుల నుంచి ఎక్కువ రాబట్టారా? ఫైనల్‌గా ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే విజేతలు అనేదిటాస్క్‌. 

ఇక బాత్రూంలోని నాప్కిన్లకు కూడా భారీగా మొత్తం వసూలు చేస్తున్నారని వినియోగదారుల టీంలోని అర్చన, ఆదర్శ్‌లు యజమానుల టీంలోని హరితేజను తిట్టారు. దానికి హరితేజ బాధపడింది. మరీ నాప్కిన్లకు కూడా డబ్బులు అడుగుతానా? నేనంత చీప్‌గా కనిపిస్తున్నానా? వినియోగదారులు తనను ఆడపిల్లగానే కాదు.. మనిషిగా కూడా చూడటం లేదని వాపోయింది. కానీ అర్చన సర్ధిచెప్పడంతో వివాదం తొలగింది. చివరకు వినియోగదారుల టీం వద్దే ఎక్కుడ డబ్బు ఉండటం, డబ్బులను ఆదా చేయడం కోసం ఎన్నో కష్టాలు పడి ఎక్కువ మొత్తం జాగ్రత్త చేశారు. ఇక ఇందులోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశించిన దీక్షిపంత్‌తో ప్రిన్స్‌ గొడవ పడ్డాడు. చివరకు సారీ చెప్పాలని భావించి, ఎలా సారీ చెప్పాలి అని ప్రిన్స్‌ అడగ్గా, ఓ ముద్దు ఇచ్చి సారీ చెప్పమని కత్తి మహేష్‌ సూచించడంతో ప్రిన్స్‌.. దీక్షాపంత్‌కి ముద్దుపెట్టి సారీ చెప్పడం ఆసక్తికరం. 

Bigg Boss Telugu - Prince Kisses Deeksha Panth:

Majority of Telugu audience are of a feeling that Big Boss is failing to meet the expectations and Jr NTR has taken a wrong step in being a part of it.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ