తెలుగు నిర్మాతల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వ్యక్తి బెల్లంకొండ సురేష్ గతంలో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నాడు బాలకృష్ణతో కాల్పుల విషయంతో పాటు మంచు మోహన్‌బాబుకి చెందిన 'ఊ కొడతారా.. ఉలిక్కి పడుతారా' అనే చిత్రం సెట్‌ని ఉపయోగించుకుని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, నాడు మంచు ఫ్యామిలీకి, బెల్లంకొండకు పెద్ద వివాదమే చెలరేగింది.
ఇక తాజాగా ఆయన నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిని ముందు పెట్టుకుని తన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు11న విడుదల కానుండగా, ఈ చిత్రం విషయంలో ఓ వివాదం చెలరేగింది. ఈ చిత్రం షూటింగ్ పోయినేడాది డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. షూటింగ్‌లో భాగంగా లైట్స్‌ని అరేంజ్ చేసే కాంట్రాక్ట్‌ని అశోక్‌రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. కానీ దాని సొమ్మును తనకు పూర్తిగా ఇవ్వడం లేదని ఈ కాంట్రాక్టర్ మాదాపూర్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. తనకు 10లక్షలకు పైగా రావాల్సివుండగా, తనకు 2లక్షల కొంత మొత్తంలోనే చెల్లించాడని మిగిలిన మొత్తాన్ని ఇవ్వడం లేదని ఆ కాంట్రాక్టర్ కేసు పెట్టగా, ఆయనకు ఇవ్వాల్సిన రెండు లక్షల పై మొత్తం డబ్బును తాను తిరిగి ఇచ్చేసానని, కానీ తనను ఆ కాంట్రాక్టర్ ఇంకా డబ్బుల కోసం అనవసరంగా ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని, బెల్లంకొండ సురేష్ కూడా ఆ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టాడు.
ఇక బయటి హీరోలకే కోట్లలో పెట్టుబడి పెట్టి సినిమాలు తీశానని, నా కొడుకుకు 100కోట్లు బడ్జెట్ పెట్టినా తక్కువేనని చెప్పిన బెల్లకొండ తన కుమారుడు నటించిన చిత్రాలకు పెద్ద దర్శకులను, ఇతర భారీ టెక్నీషియన్లను, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లను తీసుకుని డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతుంటాడు. ఇకా ఆయనకు గతంలో పలువురు బయ్యర్లతో కూడా విభేదాలున్నాయి. దాంతో తానే నిర్మాతగా ఉంటే బయ్యర్లు, ఫైనాన్షియర్లు ముందుకురారని తెలిసే.. ఆయన మిర్యాల రవీందర్‌రెడ్డి వంటి వారిని ముందుంచుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి.