Advertisementt

వామ్మో..నయన్ మరీ అంతా..!?

Thu 03rd Aug 2017 07:04 PM
nayanthara,uyyalavada narasimha reddy,nayanthara dth ad,balakrishna 102nd movie  వామ్మో..నయన్ మరీ అంతా..!?
Nayanthara Demands High Remuneration for Movies వామ్మో..నయన్ మరీ అంతా..!?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఇప్పుడు నయనతార డిమాండ్ స్టార్ హీరోల రేంజ్ వుంది. అక్కడ స్టార్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార చిన్న హీరోల సినిమాలకు కూడా అంతే బాదుడు బాదుతుంది. చిన్న లేదు పెద్ద లేదు ప్రతిఒక్క సినిమాకి నయన్ డిమాండ్ భారీ స్థాయిలోనే వుంది. అలాగే నిర్మాతలకు కండిషన్స్ పెడుతూ వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న నయనతార డిమాండ్ కి ఏ ఢోకా లేదు. అందులోను నయనతార కేవలం హీరోల పక్కన హీరోయిన్ గానే నటించకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా దూసుకుపోతుంది.

ప్రస్తుతానికి ఒక్కో సినిమాకి 3  కోట్లు డిమాండ్ చేస్తున్న నయనతార ఇప్పుడు యాడ్స్ రంగంలో కాలు పెట్టింది. లేటెస్ట్ గా నయనతార డీటీహెచ్ సర్వీస్ యాడ్ కోసం రెండు రోజుల షూట్ కి  4 కోట్లు ఛార్జ్ చెయ్యడమే కాకుండా టాటా స్కై ప్రెస్ మీట్స్ ప్రమోషన్స్ కోసం మరో కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఒక్కో సినిమా కోసం నెల నుండి రెండు నెలల వరకు డేట్స్ ఇచ్చి దాదాపు మూడు కోట్లు వసూలు చేసే నయనతార ఇప్పుడు ఒక్క యాడ్ చేసినందుకే ఇలా 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటే ముందు ముందు అమ్మడుని తట్టుకోవడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నయనతార డిమాండ్ ఒక్క కోలీవుడ్ లోనే లేదు. ఇక్కడ టాలీవుడ్ లో కూడా నయన్ డిమాండ్ మాములుగా లేదు. బాలకృష్ణ 102  వ చిత్రంలో నటించేందుకు గాను నయనతార 4 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక చిరంజీవి పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లో నటించడానికి 5 కోట్ల డిమాండ్ నిర్మాతల ముందు పెట్టింది. వామ్మో మరి అంతా అని ఉయ్యాలవాడ టీమ్ షాక్ అవ్వగా.... దానైకి నయన్ ఉయ్యాలవాడ చిత్రానికి డేట్స్ ఎక్కువ ఇవ్వాలి... అలాగే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వాలంటే ఇవ్వాల్సిందే అంటుంది. అందుకే ఉయ్యాలవాడ టీమ్ నయన్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Nayanthara Demands High Remuneration for Movies:

Nayanthara Demands High Remuneration for Uyyalavada Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ