మురుగదాస్ - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకున్నప్పటి నుండే ఆ సినిమాపై విపరీతమైన ఆసక్తి రావడమే కాదు, సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తున్నామని చిత్ర టీమ్ ప్రకటించడం, పబ్లిసిటీ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజికావడం ఒకేసారి జరిగిపోయాయి. ఈ చిత్రాన్ని మురుగదాస్ తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇక 'స్పైడర్' చిత్ర ఫస్ట్ లుక్ అప్పటినుండి 'స్పైడర్' సింగిల్ విడుదల సందర్భంగా విడుదల చేసిన మహేష్ 'స్పైడర్' న్యూ పోస్టర్ వరకు మహేష్ అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులని కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరగడం, శాటిలైట్ హక్కుల ద్వారా రికార్డు ప్రైస్ సొంతం చేసుకోవడంతో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో భాగంగా 'స్పైడర్' సినిమా ఓవర్సీస్ హక్కులు ఊహించని భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది. ఓవర్సీస్ లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'స్పైడర్' కి సుమారు రూ.15.2 కోట్ల భారీ మొత్తాన్ని పెట్టి ఈ హక్కుల్ని కొనుగోలు చేసిందట. మహేష్ కెరీర్ లోనే ఈ ఓవర్సీస్ డీల్ భారీ డీల్ అంటున్నారు.
మామూలుగానే ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు 'స్పైడర్' డీల్ చూస్తుంటే మాత్రం ఈ చిత్రానికి అక్కడ ఎంతగా డిమాండ్ వుందో తెలుస్తుంది. మరి సెప్టెంబర్ 27 న విడుదల కాకునున్న ఈ చిత్రంలో మహేష్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.