Advertisementt

రకుల్ ఎందుకు ఏడుస్తుంది..అనేదే మెయిన్!

Thu 03rd Aug 2017 05:54 PM
rakul preet singh,jaya janaki nayaka,rakul role in jaya janaki nayaka  రకుల్ ఎందుకు ఏడుస్తుంది..అనేదే మెయిన్!
Rakul Preet Singh Role in Jaya Janaki Nayaka రకుల్ ఎందుకు ఏడుస్తుంది..అనేదే మెయిన్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో అందరి స్టార్  హీరోలతో నటిస్తూ టాప్ పొజిషన్ కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఒకమాదిరి హీరోలతో కూడా జట్టుకట్టేస్తుంది. ఒక్కోమెట్టు ఎక్కాలంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే సామెతను రకుల్ పరిపూర్ణంగా అమలు చేస్తుంది. రెండు నెలల క్రితమే 'రారండోయ్ వేడుక చూద్దాం' తో హిట్ అందుకున్న అమ్మడు ఇప్పుడు మరో హిట్ కోసం ఎదురు చూస్తుంది. రకుల్ తాజాగా నటించిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ నెల 11 న విడుదల కాబోతుంది. బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం విడుదల సందర్భంగా రకుల్ మీడియాకి ఇచ్చిన ఇంర్వ్యూలో చాలా సంగతులే ముచ్చటించింది. 

రకుల్ ప్రీత్ 'జయ జానకి నాయక' లో తన పాత్ర ఎలా వుండబోతుందో చెబుతూ .. నా పాత్ర ఇందులో చాలా బావుంటుంది. ఈ సినిమాలో చాలా వరకు ఏడుస్తూనే ఉంటాను..... అయితే సినిమా షూటింగ్ సమయంలో కళ్ళల్లో నీళ్లు రావడానికి గ్లిజరిన్ ఎక్కువగా వాడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ ఏడుపు సీన్ అయ్యాక కూడా దాదాపు ఏడుపు మొహంతోనే ఉండేదానినని చెప్పుకొచ్చింది. బోయపాటి శ్రీను అయితే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారని చెబుతూనే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా 'జయ జానకి నాయక' చిత్రంలో చాలా బాగా నటించారని చెప్పుకొచ్చింది. 

ఇకపోతే  పవన్ కళ్యాణ్ - సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో రకుల్ నటిస్తుందని ప్రచారం జరుగుతున్న వార్తలను రకుల్ ఖండించింది. పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోనని... అలాగే తనకు ఛాన్స్ వచ్చిన విషయాన్నీ అందరికి తెలియజేస్తానని చెప్పుకొచ్చింది.

Rakul Preet Singh Role in Jaya Janaki Nayaka:

Rakul Preet Singh revealed Her Character in Jaya Janaki Nayaka

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ