బాహుబలి తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి టేకింగ్‌ని, ఆయన సినిమాను తెరకెక్కించిన విజన్ చూసివారికి ఎంతో పేరు వచ్చింది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇక ఈచిత్రం విజయం సాధిస్తున్న తీరు చూసి ఆయనకు ఏకంగా ఎన్నో ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఆయన తడిసి ముద్దయ్యారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన విదేశాలకు కూడా ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి.
ఈచిత్రం విడుదలై ఇంతకాలం కావస్తున్నా ఆయనపై ఇంకా ప్రశంసల వర్షం ఆగలేదు. ఇక ఆ తదుపరి ఆయన చేసే చిత్రంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో కరణ్ జోహార్‌తో ఓ చిత్రం చేస్తాడని. దానయ్యకు గానీ లేక కె.ఎల్.నారాయణ దుర్గాఆర్ట్స్‌లోనే ఆయన తదుపరి చిత్రం కూడా ఉంటుందని, ఆయన తర్వాత చేసే చిత్రం తెలుగు చిత్రమని వార్తలు వచ్చాయి. ఇక ఆయన మహేష్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా పలువురిలో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.
ఇక రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి చిత్రం స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నాడని, కథ పూర్తయిన తర్వాతే హీరో ఎవరో ప్రకటిస్తాడని అంటున్నారు. 'మగధీర'తర్వాత సునీల్‌తో 'మర్యాద రామన్న' చేసిన విధంగా 'బాహుబలి' తర్వాత కూడా ఆయన సినిమా అంటే అంచనాలు మితిమీరిపోయే ప్రమాదం ఉండటంతో చిన్న చిత్రం చేసినా ఆశ్యర్యం లేదన్నారు. మరోవైపు రాజమౌళి ఇప్పుడు కాదని చెబుతున్నా కూడా మహాభారతం తీస్తాడనే వార్తలు మాత్రం ఆగలేదు. తాను మాత్రం తన తదుపరి చిత్రంలో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌లు లేకుండా చేసుకుంటానని తెలిపాడు.
అయినా పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగుకి చెందిన నిర్మాతలు, హీరోలు ఆయనతో టచ్‌లో ఉండాలని విపరీతంగా ఫోన్స్ చేస్తుండటంతో ఆయన అందరికి తెలిసిన ఫోన్ నెంబర్‌ని మార్చి, కొత్త నెంబర్ తీసుకుని, కేవలం తన సన్నిహితులకు, బంధువులకు మాత్రమే టచ్‌లో ఉన్నాడట. మొత్తానికి రాజమౌళికి పొగడ్తల వాన కాస్తా జడివానగా మారడంతో ఇలా చేయకతప్పని సరైందని అంటున్నారు.