డ్రగ్స్ వ్యవహారంలో 12 మంది సెలబ్రిటీస్ కి సిట్ అధికారులు నోటీసులు పంపడం.. వారిని విచారణ చేసే తతంగం అంతా మంగళవారంతో పూర్తయ్యింది. 12 మంది సెలబ్రిటీస్ ని విచారణ అయితే చేపట్టారు గాని వారు నిందితులా? లేకుంటే అనుమానితులా? అనే విషయాన్ని మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ఇక విచారణకు హాజరైన ఆ సెలబ్రిటీస్ మాత్రం మౌనం దాలుస్తున్నారు. అలాగే రెండో లిస్ట్ మాత్రం బయటపెట్టడంలేదు అధికారులు. అసలు రెండో లిస్ట్ అంటున్నారు గాని అది బయటకి వస్తుందా? అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. ఇక నిన్నటిదాకా హడావిడి చేసిన మీడియా, అధికారులు కూడా కామ్ అయ్యారనుకునే లోపే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకొచ్చింది.
అదేమిటంటే విదేశాల నుంచి రామానాయుడు స్టూడియోకు వచ్చే కొరియర్స్, పార్శిల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దృష్టి సారించడమే కాదు నిఘా కూడా పెట్టింది. ఆ పార్శిల్స్ స్టూడియో కి రాగానే ఎక్సైజ్ సీఐ కనకదుర్గ ఆ పార్శిల్స్ ని స్వయంగా పరిశీలించడంపై అనుమానాలు మొదలయ్యాయంటున్నారు. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి సురేష్ బాబు లైన్ లోకొచ్చారు. ఈ పార్శిల్స్ తనిఖీ వ్యవహారంపై రానా తండ్రి సురేష్ బాబు స్పందిస్తూ వెన్నునొప్పికి వాడే కొన్ని పరికరాలను రానా పార్శిల్ తెప్పించుకున్నాడని తెలిపారు. ఆ పార్శిల్‌ను పరిశీలించేందుకు ఎక్సైజ్ పోలీసులు స్టూడియోకు వచ్చారని సురేష్‌బాబు క్లారిటీ ఇచ్చాడు.
మరి నిప్పు లేనిదే పొగ రాదు అంటారు... అందులోను ఈ డ్రగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరుస్తూ ఇలా రామానాయుడు స్టూడియో కి వచ్చే పార్శిల్స్ ని తనిఖీ చేయడమనేది ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్కయ్యింది. ఈదెబ్బకి సినిమా ఇండస్ట్రీలోని పెద్దల గుండెల్లో రాయి పడిందని చెబుతున్నారు. మరి రెండో లిస్ట్ లో పెద్ద తలకాయల పేర్లు ఉండబట్టే ఈ రెండో లిస్ట్ వ్యవహారాన్ని పోలీస్ లు కూడా పక్కన పెట్టారనే ఆరోపణలు సైతం సిట్ అధికారులు ఎదుర్కుంటున్నారు. చూద్దాం మున్ముందు ఏం జరగబోతుందో!!