Advertisementt

నా సినిమా నాటకం కాదంటున్న సుకుమార్‌!

Wed 02nd Aug 2017 07:05 PM
director sukumar,dharshakudu movie,ram charan,rangasthalam 1985 movie  నా సినిమా నాటకం కాదంటున్న సుకుమార్‌!
Director Sukumar About Rangasthalam 1985 Movie Title నా సినిమా నాటకం కాదంటున్న సుకుమార్‌!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ తన స్వీయ నిర్మాణంలో తన అన్నయ్య కుమారుడు అశోక్‌ హీరోగా, హరిప్రసాద్‌ దర్శకత్వంలో 'దర్శకుడు' అనే చిత్రం నిర్మిస్తున్నాడు.ఈచిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్‌ అందరిలో క్యూరియాసిటీని కలిగిస్తోంది. సినిమాలో సినిమాల గురించి చెప్పే కథ కావడం, అలాంటి చిత్రాలు తెలుగులో అరుదే కావడంతో ఇది బాగా ఆసక్తిని రేపుతోంది. ఇక ఈచిత్రం ఓ దర్శకునికి, కాస్ట్మూమ్‌ డిజైనర్‌కి జరిగే ప్రేమకథగా రూపొందుతోంది. 

ఈ చిత్రంలోని దర్శకుని పాత్ర తనను పోలివుంటుందనే వార్తలు సుకుమార్‌ ఖండిస్తూనే ఈచిత్ర దర్శకుడు హరిప్రసాద్‌ షూటింగ్‌ లోకేషన్స్‌లో నా ప్రవర్తన చూసి కొన్నిసీన్స్‌ రాసుకుని ఉండవచ్చు అనిక్లారిటీ ఇచ్చాడు.ఇక ఈ చిత్రం టైటిలేగాక సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న 'రంగస్థలం 1985' టైటిల్‌పై కూడా స్పందించాడు. రంగస్థలం అంటే నాటకరంగం, స్టేజీల మీద వేసే ప్రదేశం కావడం,ఇక స్పెసిఫిక్‌గా 1985 అని వేయడంతో ఆనాడు జరిగే నాటకరంగానికి చెందిన కథగా పలువురు భావిస్తున్నారు. కానీ దానిని సుమాకుర్‌ ఖండించాడు. 

ఈ చిత్రం నాటకాలను బేస్‌ చేసుకుని చేస్తున్న చిత్రం కాదని, పల్లెటూరిలో ఎవరికైనా ఆపద, కష్టం వస్తే ఊరందరూ కలిసి అక్కడ చేరి తమ వంతు సాయం చేస్తారని, దానిని చూస్తే ఓ వేదికలాగా, రంగస్థలంలాగా కనిపిస్తుందని, అందుకే ఆ టైటిల్‌పెట్టామని చెప్పాడు. ఇక 1985కి వెళ్లాల్సిరావడంతో దానిని జస్టిఫై చేశామని, ఆనాడు మొబైల్‌ ఫోన్లు కూడా లేకపోవడం గమనార్హమని చెప్పాడు. 25ఏళ్లు పల్లెటూరిలో జీవించాను. ఈ పాయింట్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇన్నాళ్లకు ఒకే అయిందన్నాడు. సైన్స్‌ఫిక్షన్‌ చేయాలని ఉన్నా. దానికి మన బడ్జెట్‌ సరిపోదని, మార్కెట్‌పరంగా అది వర్కౌట్‌ అవుతుందో లేదోనని, వరుస హిట్స్‌ వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పాడు. 

Director Sukumar About Rangasthalam 1985 Movie Title:

Director Sukumar and ram Charan Combination movie 'Rangasthalam 1985' sukumar reveal on Rangasthalam 1985 Movie title.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ