వెంకయ్య ఏదైనా ఆచితూచి, తనకు అనుకూలంగా ఉంటూనే తన వ్యాఖ్యలు పాము చావకూడదు. కట్టె విరగకూడదు అనే విధంగా మాట్లాడుతారు. కానీగత కొన్ని రోజులుగా మాత్రం ఆయన ఎలానూ ఉప రాష్ట్రపతి కావడం ఖాయంతో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల కిందట బిజెపిలో వాజ్‌పేయ్, అద్వానీల తర్వాత తానే సీనియర్‌ని అని ఇన్‌డైరెక్ట్‌గా తనకంటూ ప్రధాని మోదీ జూనియర్ అనే రకమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇంతకాలం మోదీ గుజరాత్‌లో అభివృద్ది, అవినీతి నిర్మూలన వంటి వాటితో దేశవ్యాప్తంగా క్రేజ్ సాధించి ప్రధానిగా అయ్యాడని అందరూ భావించారు.
అదే సమయంలో మోదీపై నాటి గోద్రా హత్యల కేసు వంటి వివాదం కూడా ఉంది. దీంతో ఆయన్ను పదవి నుంచి వాజ్‌పేయ్ తొలగించాలని అనుకోవడం, అద్వానీ.. మోదీనే ఉండాలని పట్టుబట్టడం తెలిసిందే. ఇక నాడు మోదీని చూపించి ఈయన అయితేనే గుజరాత్ సీఎంగా బాగుంటాడని అద్వానీకి చెప్పింది... ఇక మోదీకి ఉన్న క్రేజ్‌ని, ఇమేజ్‌ని ఊహించి, ఆయనకు గోద్రా ఘటన పెద్ద ఇబ్బంది కాదని, ఆయన్ను ప్రధానిని చేయాలని అద్వానీకి సూచించింది కూడా తానేనని వెంకయ్య అన్నాడు. దానివల్లనే మోదీ ప్రధాని అభ్యర్థి అయ్యాడని చెప్పాడు.
ఇక ఆయన తాజాగా 2019లో తాను ప్రధాని అవుతాననే ఉద్దేశ్యంతోనే తనను ఉపరాష్ట్రపతి పదవికి మోదీ ఎంపిక చేశాడని, లేకపోతే 2019లో వెంకయ్యే ప్రధాని అయ్యే వాడని వస్తున్న వ్యాఖ్యలు తనపై అభిమానంతో చేస్తున్నారో.. దురభిప్రాయంతో చేస్తున్నారో తెలియదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తానికి తనను ప్రధానిని చేసిన వెంకయ్యకు కీలక మంత్రి పదవులు ఇవ్వడం, నేడు ఉపరాష్ట్రపతిని చేసి మోదీ గురుదక్షిణ చెల్లించుకున్నాడనే భావించాలా? లేక వెంకయ్య పెత్తనం లేకుండా ఉపరాష్ట్రపతి పదవితో వెంకయ్యను మోదీ బలిపీఠం ఎక్కించాడా? అనేది అందరిలో ఉన్న అనుమానం.