'బాహుబలి'తో తన రేంజ్ పెంచుకుని, నేషనల్‌స్టార్‌గా మారడమే కాదు.. ఈచిత్రం విడుదలైన యూరప్‌దేశాలలో కూడా ప్రభాస్‌కి ఫాలోయింగ్, క్రేజ్, గుర్తింపు ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో యువిక్రియేషన్స్ బేనర్‌పై 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈచిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దానికి గాను ఏకంగా 150కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ఇక 'బాహుబలి' కోసం దాదాపు ఐదేళ్లు అంకితమైన ప్రభాస్ ఇక ఆలస్యం చేయకుండా తన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు గ్యాప్ లేకుండా చిత్రాలను అందించాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే 'జిల్'ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో దీపావళి నుంచి మరో చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదే విడుదలయ్యేలా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా యువి క్రియేషన్స్ సంస్థే నిర్మిస్తోంది ఈచిత్రానికి సంబంధించిన ప్రీపొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయిట. ప్రభుదేవాతో పాటు కరణ్‌జోహర్, సాజిద్ నడియా వాలాలను కాదని ప్రభాస్ ఎంతో నమ్మకంతో సుజీత్‌లాగానే 'జిల్' రాధాకృష్ణకి కూడా ఓకే ఒక్క చిత్రం అనుభవం చూసి రెండో చిత్రం సెంటిమెంట్‌ని కూడా కాదని నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం నిజంగానే గ్రేట్.
దానికి కారణం సుజీత్ 'రన్ రాజా రన్' తర్వాత, రాధాకృష్ణ 'జిల్' తర్వాత ఇంతకాలం కేవలం ప్రభాస్ ని నమ్మి, కథను మెరుగులు దిద్దుతూ ఆయన కోసమే వెయిట్ చేయడం కారణంగా చెబుతున్నారు. ఇక 'బాహుబలి' చిత్రం పలు యూరోపియన్ దేశాలలో విడుదలై అక్కడ తనకు మంచి గుర్తింపు రావడంతో రాదాకృష్ణతో చేయనున్న స్టైలిస్ లవ్‌స్టోరీని కూడా యూరప్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు ఇక్కడ మన దేశంలో విడుదల కాకముందే యూరప్‌లోని పలు దేశాలలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్‌లో ముందుగా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారట. ఎంతో కథపై నమ్మకం ఉండబట్టే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని అర్ధమవుతోంది.