త్వరలో సినీ జంట రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివానీ తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే.. కాగా ఆమె 'పెళ్ళి చూపులు' నిర్మాత రాజ్ కందుకరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయమయ్యే చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుందని ఈమద్య బాగా వార్తలు వచ్చాయి. తాజాగా దానికి సంబంధించిన ఓ సంఘటనను సాక్ష్యంగా చూపుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన యాంటీ డ్రగ్ వాక్‌లో శివ, శివాని, రాజశేఖర్, జీవిత, రాజ్ కందుకూరి కలిసి పాల్గొన్నారు.
ఈ యాంటీ డ్రగ్ వాక్ సందర్భంగా శివ, శివానిలు పక్క పక్కనే నిల్చుని ఫోటోలకు మీడియాకు ఫోజులిచ్చారు. శివ కందుకూరి అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2018 మొదట్లో వీరిద్దరు తెరంగేట్రం చేసే చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. తల్లిదండ్రుల నటనావారసత్వాన్ని అందుకున్న శివాని యాంటీ డ్రగ్ వాక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శివానా ఎంతో అందంగా,సెక్సప్పీల్‌తో, హీరోయిన్‌కి కావాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం శివానీ మెడిసిన్ చదువుతూ,సినిమా రంగానికి చెందిన విషయాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. డ్యాన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్, నటనతో పాటు తల్లి జీవిత, తండ్రి రాజశేఖర్‌ల నుంచి పలు మెళకువలు నేర్చుకుంటూ ఉంది.