రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇద్దరు స్టార్ హీరోల భార్యలే కాదు. వారి వారి ప్రొఫెషన్స్‌లో ఎంతో బిజీ బిజీగా ఉండే వ్యక్తులు, ఉపసాన అపోలో గ్రూప్‌కి డైరెక్టర్‌గా బాధ్యతలు అందిస్తూ, అపోలో ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే, మరోవైపు నమ్రతా శిరోద్కర్ తన భర్త చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, దత్తత తీసుకున్న గ్రామాల పర్యవేక్షణతో పాటు భర్తకి సంబంధించిన ప్రొడక్షన్, ఇతర షూటింగ్ వ్యవహారాలలో తలమునకలై ఉంటోంది.
ఇంత బిజీలో కూడా వీరిద్దరు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. కాగా తాజాగా ఉపాసన, నమ్రతాలు ఒక్క అమ్మాయికి ముద్దు ఇస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన, నమ్రాతాలలో పాటు కొందరు గర్ల్‌ఫ్రెండ్స్ కలిసి ఓ గర్ల్ గ్యాంగ్‌గా ఏర్పడి చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పాటలను పాడుకుంటూ ఉన్నారు. ఈ పార్టీ సందర్భంగా వారిద్దరు కలసి తమ స్నేహితురాలిని ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఆమె ఎవరో కాదు దియా భూపాల్. వీరిద్దరు ఆమె బుగ్గలను ముద్దుపెట్టుకుంటున్న ఫొటో బాగా హల్‌చల్ చేస్తోంది.
అఖిల్ అక్కినేని మాజీ లవర్ శ్రియా భూపాల్‌కి ఈ దియా భూపాల్‌కి దగ్గరి రిలేషన్ ఉంది. శ్రియా భూపాల్ సోదరుడు కృష్ణ భూపాల్. ఈయన జివికె మనవడు. కృష్ణ భూపాల్ ముంబై బేస్‌డ్ ఫ్యాషన్ డిజైనర్ దియా మెహతాను పెళ్లి చేసుకున్నాడు. దాంతో దియా మెహతా కాస్తా దియా భూపాల్‌గా మారింది. ఉపాసనకు జివికె ఫ్యామిలీకి, భూపాల్ ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. దీంతో నమ్రతా కూడా ఈమెకి ఫ్రెండ్ అయింది.
వీరందరూ చాలా చాలా చిలిపి పనులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ ఒకరినొకరు బాగా ప్రోత్సహించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే దియాభూపాల్‌కి ఉపాసన, నమ్రతాలు ఈ దియాభూపాల్‌కి బుగ్గలపై ముద్దు ఇస్తూ, తమ స్నేహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు.