కృష్ణవంశీ చిత్రాలంటే హీరోయిన్లను అందంగా చూపిస్తాడని, ఆర్టిస్ట్‌లని సాన పడతాడని చెప్పుకుంటూ ఉంటారు. కానీ కృష్ణవంశీలో దేశభక్తి చాలా ఉందనేది అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర దేశభక్తికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ అంటే కృష్ణవంశీ సినిమాల్లోని పోలీస్ పాత్రలా ఉండాలని, కృష్ణవంశీ సినిమా చూసే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్రని ఎవరైనా మరిచిపోగలరా..! ఇప్పుడలాంటి పాత్రే మరోసారి కృష్ణవంశీ క్రియేట్ చేశాడు. అయితే ఈసారి శ్రీకాంత్ ప్లేస్‌లో సందీప్ కిషన్ కనిపిస్తాడు.
వివరాల్లోకి వస్తే కృష్ణవంశీ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కి.. ఆగస్ట్ 4న విడుదల కాబోతున్న 'నక్షత్రం' చిత్రంలో సందీప్ కిషన్ పాత్ర చూసిన ప్రతి పోలీస్ గర్వపడతాడని, ఈ మధ్య పోలీసులపై ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని స్వయంగా ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన వాళ్లే చెబుతున్నారంటే.. కృష్ణవంశీ ఏ రేంజ్‌లో ఈ పాత్రని తెరకెక్కించాడో అర్ధం చేసుకోవచ్చు. సందీప్ కిషన్ ఈ పాత్రకి ఎంత ప్రాణం పోశాడో ఊహించుకోవచ్చు. సందీప్ కిషన్ సాదారణ పాత్రని కూడా ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయగలడు. ఉదాహరణకి ఆయన నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌నే చెప్పుకోవచ్చు. అలాంటి సందీప్ కిషన్‌కి కృష్ణవంశీ తోడైతే..అబ్బో ఇంక ఆపతరమా..!
'నక్షత్రం' చిత్రంలో సందీప్ కిషన్ నటనకి చిత్ర యూనిట్టే కాదు.., సెన్సార్ సభ్యులు కూడా వావ్..అంటున్నారంటే..నిజంగా సందీప్ కిషన్ హై రేంజ్ నటనని ఈ చిత్రంలో చూడబోతున్నామన్నమాట.