Advertisementt

ఆ విషయంలో తగ్గేదే లేదంటున్నారు..!

Mon 31st Jul 2017 02:54 PM
prabhas,saaho movie,producer shyam prasad reddy,uv creastions  ఆ విషయంలో తగ్గేదే లేదంటున్నారు..!
Prabhas New Movie 'Saaho' Updates ఆ విషయంలో తగ్గేదే లేదంటున్నారు..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' తర్వాత దేశంలోని అన్ని వుడ్‌లలో ప్రభాస్‌కి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడి నేషనల్‌ స్టార్‌గా మారాడు. దాంతో ఆయనతో తదుపరి చిత్రానికి మొదట బడ్జెట్‌ 50కోట్లు అనుకున్న యువి క్రియేషన్స్‌ అధినేతలైన ప్రమోద్‌, వంశీ, దర్శకుడు సుజిత్‌లు ఏకంగా బడ్జెట్‌ని మూడింతలు చేసి 150కోట్లకు పెంచేశారు. ఇక యువిక్రియేషన్స్‌లో ప్రభాస్‌కి కూడా భాగస్వామ్యం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. 

జస్ట్‌ శాంపిల్‌గా ఓ టీజర్‌ని విడుదల చేసి దుబాయ్‌లోని బిల్దింగ్‌లను చూపిస్తూన్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఎందరో హీరోయిన్లను పరిశీలిస్తూ ఫైనల్‌ చేయలేకపోతున్నారు. కానీ సినిమాలోని మిగిలిన క్యాస్టింగ్‌ విషయంలో మాత్రం జోరును పెంచారు. ఇందులో మెయిన్‌ విలన్‌గా నీల్‌ నితిన్‌ ముఖేష్‌ని తీసుకుని ఆయన మీద షూటింగ్‌ కూడా చేస్తున్నారు. అది చాలదన్నట్లు మరో హిందీ నటుడు చుంకీ పాండేను కూడా ఓ పాత్రకు తీసుకున్నారు. మరో వైపు జాకీ ష్రాఫ్‌ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించే క్యాస్టింగ్‌ రెడీ అయింది. 

ఇక తమిళ ప్రేక్షకుల కోసం రామ్‌ చరణ్‌ 'బ్రూస్‌లీ'లో నటించిన అరుణ్‌ విజయ్‌ కుమార్‌ని కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్‌గా మాత్రం బాలీవుడ్‌కి చెందిన నటే ఉంటుందని చెప్పవచ్చు. ఆ మధ్య ప్రభాస్‌కి చెందిన ఓ లుక్‌ ఫోటోలు దర్శనమిర్చాయి. ఇక టీజర్‌లో ఆల్‌రెడీ ఓ లుక్‌ ఉంది. తాజాగా ప్రభాస్‌ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి కూతురి వివాహంలో పొట్టిగా ఉన్న జుట్టుతో మరో గెటప్‌లో కనిపించాడు. మరి ఇంతకీ ఆయన 'సాహె'లో కనిపించనున్న లుక్‌ ఏమిటి? అనేది సస్పెన్స్‌గా మారింది. 

Prabhas New Movie 'Saaho' Updates:

Pramod, Vamsi and director Sujit of UV Creations headed by  First originally budgeted 50 crores in the first budget increases triple of Rs 150 crores total on Saaho movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ