'బాహుబలి', 'భజరంగీ భాయిజాన్'లతో రాజమౌళి తండ్రి, నేడు దేశంలోనే టాప్ రైటర్‌గా పేరుతెచ్చుకున్న విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం రెండు కథలను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన గతంలో శంకర్ దర్శకత్వంలో అర్జున్-మనీషా కోయిరాల జంటగా వచ్చిన 'ఒకే ఒక్కడు' చిత్రానికి సీక్వెల్‌ని తయారు చేస్తున్నాడు. ఇక విజయేంద్ర ప్రసాద్ కేవలం 'బాహుబలి, భజరంగీ భాయిజాన్'లతోనే కాదు.. ఆయన తెలుగులో కథలను అందించిన పలు చిత్రాలు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక విజయేంద్ర ప్రసాద్ మీరు శంకర్ చిత్రానికి కథ అందిస్తారా? అని అడిగితే ఆయన కోరితే చాలు కథను తయారు చేసి, మీరే తీయాలి సార్ అని చేతులు కట్టుకుని,, చేతులు జోడించి మరీ అడుగుతానని చెప్పి తన వృత్తి పట్ల తనకున్న గౌరవాన్ని, నిబద్దతను చాటుకున్నాడు. ఇక 'ఒకే ఒక్కడు' సీక్వెల్ పూర్తిగా ఆ కథకి కొనసాగింపుగా ఉండదని, కానీ మెయిన్ పాయింట్ మాత్రం దానికి అనుగుణంగానే ఉంటుందని చెప్పాడు.
ఇక తాను గతంలో రాజమౌళి-రవితేజలతో పని చేసిన 'విక్రమార్కుడు' చిత్రానికి కూడా సీక్వెల్ రాయడంలో బిజీగా ఉన్నానని చెప్పాడు. మొత్తానికి ఆయన ఎక్కడ ఉన్నా, బయటకు వచ్చినా రాకపోయినా ఆయన ఆలోచనలన్నీ తన వృత్తి చుట్టూనే తిరుగుతుంటాయని మరోసారి స్పష్టమైంది.