బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలిసినపుడే ఎన్టీఆర్ ఆ షో కి హోస్ట్ గా వస్తున్నాడని రివీల్ చేసిన స్టార్ మా యాజమాన్యం.... బిగ్ బాస్ షో బుల్లితెర మీద లాంచ్ అయ్యేవరకు సదరు పార్టిసిపేట్స్ ని రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేసింది. ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇవ్వడం ఈ బిగ్ బాస్ షోకి అసలుసిసలైన క్రేజ్ వచ్చేసింది. ఇక పార్టిసిపేట్స్ లో కూడా సెలబ్రిటీస్ ఉండడంతో కాస్త హైప్ వచ్చినప్పటికీ కేవలం శని, ఆది వారాల్లో మాత్రమే బిగ్ బాస్ షోకి ఆదరణ రావడం మిగతా ఐదు రోజులు ఈ షోకి ఆదరణ తగ్గడంతో... కారణాలు వెతికిన షో నిర్వాహకులు ఈ షో కోసం ఎవరో ఒక సెలెబ్రిటీ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా చేరిస్తే మళ్లీ ఆ ఐదు రోజులు ఈ షోకి పబ్లిసిటీ రావడమే కాక ఆదరణ కూడా పెరుగుతుందని భావించి నలుగురైదుగురు సెలబ్రిటీస్ పేర్లను పరిశీలనలో ఉంచి ఫైనల్ గా ఒక సెలబ్రిటీ ని ఈ వారాంతంలో బిగ్ బాస్ షోలో ప్రవేశపెట్టబోతున్నారు.
అయితే ఆ కొత్త సెలెబ్రిటీ ఎవరనేది ఇప్పుడు మళ్లీ సస్పెన్సుగా మారింది. ఇకపోతే ఆ కొత్త సెలెబ్రిటీని మాత్రం బిగ్ బాస్ షో నుండి అర్దాంతరంగా తప్పుకున్న సంపూర్ణేష్ స్థానంలోకి సదరు పార్టిసిపేట్ ని తీసుకురాబోతున్నారు. మరి ఇప్పుడు రాబోయే పార్టిసిపేట్ మాత్రం చాలా గ్లామర్ గా, బ్యూటిఫుల్ గా ఉండబోతోందనే టాక్ వినబడుతుంది. ఇప్పటి వరకు ఈ షోలో పార్టిసిపేట్ మొహాలను డీ గ్లామరస్ గా ప్రేక్షకులు చూసి చూసి బోర్ కొట్టేసిందనే ఫీల్ నుండి బయటికి తేవడానికి ఇలా ఒక పేరున్న సెలెబ్రిటీని దించబోతున్నారు.
అయితే ఆ సెలబ్రిటీ ఎవరన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మొదటి నుండి వినబడుతున్న లక్ష్మి మంచు గాని, తేజస్విని గాని, లేకుంటే ఐటెం సాంగ్స్ తో అదరగొడుతున్న హంసానందినిని గాని, లేకుంటే గ్లామర్ ఫీల్డ్ లో దూసుకుపోతున్న యాంకర్ రష్మిని గాని దింపుతున్నారా? అనే సందేహంలో ప్రేక్షకులు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. ఇకపోతే మొదటి 10 రోజులు కాస్త డల్ అయిన ఈ బిగ్ బాస్ షో ఇప్పుడు ఒకరి మీద ఒకరికి మనసులో ఉన్న మంచి, చెడు అభిప్రాయాలతో కాస్త రసవత్తరంగానే అనిపిస్తుంది. ఇక మిగతా రోజుల్లో ఈ షో మరింత రసవత్తరంగా మారే సూచనలు కనబడుతున్నాయి.