Advertisementt

వర్మకి ఈ సార్.. నచ్చేశాడయ్యో..!

Sun 30th Jul 2017 01:48 PM
ram gopal varma,kcr,drugs,akun sabharwal,hyderabad,telangana  వర్మకి ఈ సార్.. నచ్చేశాడయ్యో..!
Ram Gopal Varma Fidaa over KCR words వర్మకి ఈ సార్.. నచ్చేశాడయ్యో..!
Advertisement
Ads by CJ

వివాదాస్పద కామెంట్స్‌, ట్రంప్‌ నుంచి మోదీ వరకు, కేసీఆర్‌ నుంచి చంద్రబాబు, చిరంజీవి నుండి బాలయ్య వరకు ఎవ్వరినీ పెద్దగా పొగడకపోయినా సంచలన కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో ఉండే వర్మ ఇటీవల డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ చార్మిని.. ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చాడు. ఇక అకున్‌ సబర్వాల్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడి, ఆయనను అమరేంద్రబాహుబలిగా చూపిస్తున్నారని, ఆయన హీరోగా 'బాహుబలి3' తీయాలని సెటైర్లు వేశాడు. 

ఇక తాజాగా విడుదలైన 'పైసా వసూల్‌' స్టంపర్‌ని చూసి సూపర్‌..సూపర్‌..... డూపర్‌ అంటూనే బాలయ్యని మొదటిసారి ప్రేమిస్తున్నానని తెలిపి పూరీజగన్నాథ్‌ని ఆకాశానికెత్తేశాడు. ఇక డ్రగ్స్‌ కేసు వల్ల కేసీఆర్‌కి, టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌కి, హైదరాబాద్‌, తెలంగాణలకు చెడ్డ పేరు వస్తోందని విమర్శలు గుప్పించాడు. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తాము డ్రగ్స్‌ వాడే వారిని నిందితులుగా, నేరస్థులుగా చూడటం లేదని, వారిని బాధితులుగానే పరిగణిస్తామని, వారిపై కేసులు ఉండవని చెప్పాడు. 

తెలంగాణలో డ్రగ్స్‌ వాడకం తక్కువే అని, అయినా డ్రగ్స్‌ అసలు లేని ప్రాంతంగా తెలంగాణను, హైదరాబాద్‌ని తీర్చిదిద్దాలనేది తన ఆశయమని, డ్రగ్స్‌ని హైదరాబాద్‌లో సప్లై చేస్తున్న వారిని పీచమణుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాంగోపాల్‌వర్మ కేసీఆర్‌ మాటకు ఫిదా అయిపోయాడు. 

కేసీఆర్‌ అద్భుతమైన విజన్‌ ఉన్న నాయకుడు. ఆయన డ్రగ్స్‌ వాడే వారిని బాధితులుగా చూస్తామనిచెప్పడం గ్రేట్‌, ఇక విచారణ చేస్తున్న అధికారుల మైండ్‌సెట్‌ని కూడా అలాగే మారిస్తే బాగుంటుందని కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తానికి వర్మ కోపం వచ్చినా ఆపుకోలేడు. సంతోషం వచ్చినా ఆపుకోలేడనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది....! 

Ram Gopal Varma Fidaa over KCR words:

This is what Ram Gopal Varma had to say - KCR is an awesome and fantastically beautiful leader for rightly understanding that the drug users are just nothing but victims which the team seemed to be seemingly blind about understanding and I think they need his extraordinary vision to be a right enough team.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ