ఒక్కో నటుడిది ఒక్కో శైలి. దాంతోనే ఎందరు నటీనటులు వచ్చినా ఇంకా స్థానాలు మిగిలేఉన్నాయి. ఇక నాడు అమితాబ్‌బచ్చన్‌కి ఆయన హైట్, వాయిస్‌లు హైలైట్ అయి యాంగ్రీయంగ్‌మేన్స్‌లా ఫీలయ్యే అభిమానులు ఆయనకు అభిమానులుగా మారారు. ఇక ఓ సాధారణ వ్యక్తి, పెద్దగా అందచందాలు, తెల్లటి తోలు లేని రజనీకాంత్‌ని ఆయన తరహాలోనే ఎక్కువగా ఉండే ప్రజలు ఆయన్ను తమ ఓన్ చేసుకున్నారు. మాలా ఉండే వాడు కూడా హీరోనే అని చెప్పి ఆయనకు అభిమానులుగా మారారు. ఇలా ఎవరైతే తమను తాము ఓ హీరోకి ప్రతినిధిగా కనిపిస్తారో వారే ఆయా హీరోలకు వీరాభిమానులు అవుతారు.
అలాగే తనలా బక్క పలచగా, ఊపిరిలేనట్లు, ఆ కామన్‌మేన్‌లా, పక్కింటి అబ్బాయ్‌లా ఉండే రజనీ కాంత్ అల్లుడు స్టార్ ధనుష్‌కి అదే పెద్ద బలంగా మారింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'విఐపి2' చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఆగష్టు4న ఒకేసారి విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు కూడా కండలు పెంచి యాక్షన్ హీరో అనిపించుకోవచ్చు కదా.. ! అన్న ప్రశ్నకు ధనుష్ భలే లాజిక్కు చెప్పాడు. కావాలంటే రోడ్డు మీదకు వెళ్లండి, నాలాంటి సామాన్యమైన వారు ఎందరో కనిపిస్తారు. వారందరూ నన్ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు కాబట్టే ఈస్థాయిలో ఉన్నాను. నాకంటూ కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. అవి నాకుఖచ్చితంగా తెలుసు. బలహీనతలను పక్కనపెట్టి బలాలపైనే నేను దృష్టిసారిస్తాను.
నేను ప్రభాస్‌లా కండలు పెంచి ఒకే దెబ్బకు వందమందిని కొడితే అది పేలదు. నాలా ఉండేవారిలాగానే నేను ఉండగలిగితే నాకున్న ఇమేజ్ క్రేజ్‌లు నిలబడతాయి.. అని అదరగొట్టే లాజిక్కు చెప్పాడు.ఇక 'విఐపి2'కు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. ధనుష్, అమలాపాల్, బాలీవుడ్ నటి కాజోల్‌లు నటిస్తున్నారు. మరి ఈచిత్రం తెలుగు, హిందీలలో ఎలా ఆడుతుంది? అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తోంది.