Advertisementt

బాబాయ్‌కి యంగ్‌టైగర్‌ థ్యాంక్యూ చెప్పేశాడు!

Sat 29th Jul 2017 10:20 PM
jr ntr,young tiger ntr,bigg boss,nagarjuna,babai  బాబాయ్‌కి యంగ్‌టైగర్‌ థ్యాంక్యూ చెప్పేశాడు!
Jr NTR Fondly Calls Nagarjuna ‘Babai’ బాబాయ్‌కి యంగ్‌టైగర్‌ థ్యాంక్యూ చెప్పేశాడు!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తోన్న స్టార్‌ మా లోని 'బిగ్‌బాస్‌' షో తెలుగు ప్రేక్షకులకు కొత్తదైన, సరికొత్త అనుభూతులను కలిగిస్తోంది. ఈ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌ కావడమే దీనికి అంత రెస్పాన్స్‌ రావడానికి కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు. తనదైన వాక్యాతుర్యంతో ఈ షోలో జూనియర్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ షో మొదటి వీక్‌లో టాప్‌లేచిపోయే రేటింగ్స్‌ వచ్చాయి. వీక్‌డేస్‌లో 10.4 టీఆర్పీ వస్తే శని, ఆదివారాలలో ఎన్టీఆర్‌ కనిపిస్తాడు కాబట్టి ఏకంగా 16.18 టీఆర్పీ వస్తోంది. దీంతో స్టార్‌మా పోయిన వారం నెంబర్‌1 స్థానాన్ని దక్కించుకుంది. 

ఏకంగా 16.18 టీఆర్పీ రావడం ఓ రికార్డు అని, మాటీవీ స్టార్‌మాగా మారిన తర్వాత ఈ రేంజ్ లో టీఆర్పీ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఈషోలో పార్టిసిపేట్‌ చేస్తున్న పార్టిసిపెంట్స్‌ పెద్దగా పేరున్న వారు కాకపోవడంతో మొదట్లో అందరూ నీరసపడ్డారు. ఇలాంటి యావరేజ్‌ వారితో షోని సక్సెస్‌ఫుల్‌ కావడం కష్టమని భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ టాప్‌లో కొనసాగుతోంది. వీక్షకులకి తన మాటలతో ఎన్టీఆర్‌ ఫుల్‌కిక్‌ని, ఎనర్జీని అందిస్తున్నాడు. 

ఇలా తొలి వారం సృష్టించిన సంచలనం చూసి నాగార్జున.. ఎన్టీఆర్‌తో 'కంగ్రాట్స్‌ తారక్‌. నీ ఎనర్జీ నాకెంతో నచ్చింది. నీ వల్లే ఈషో మొదటి వారంలో ఫెంటాస్టిక్‌ రేటింగ్స్‌ సాధించిందని' ట్వీట్‌ చేశాడు. దానికి సమాధానంగా ఎన్టీఆర్‌ 'చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్‌...మా అందరికీ అలాంటి బాటలు వేసిన మీ గొప్పతనం ఫలితమే ఇది' అని ఎన్టీఆర్‌ నాగార్జునకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశాడు. 

Jr NTR Fondly Calls Nagarjuna ‘Babai’:

NTR tweeted,  'Thanks a lot babai. It was your pioneering effort that paved the way for all of us'. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ