Advertisementt

మూర్తి గారూ...వాయించేశారు...!

Sat 29th Jul 2017 10:09 PM
allu arjun,dil raju,r narayana murthy,allu aravind,fidaa sambaralu,michael jackson  మూర్తి గారూ...వాయించేశారు...!
R Narayana Murthy Wants Allu Arjun in Michael Jackson Biopic మూర్తి గారూ...వాయించేశారు...!
Advertisement
Ads by CJ

పీపుల్స్‌స్టార్‌గా ఉన్న ఆర్‌.నారాయణమూర్తి చాలామందికి తెలియకపోవచ్చు గానీ, ఇండస్ట్రీలోనూ బయట కూడా ఆయనకు ఎందరో అభిమానులున్నారు. ఇక తాజాగా దిల్‌రాజు 'ఫిదా' సంబురాల్లో ఆయన చేసిన స్పీచ్‌కి చప్పట్లే కాదు.. నవ్వులు కూడా విరబూశాయి. తాజాగా జరిగిన 'ఫిదా' సంబురాలకు ఆర్‌.నారాయణమూర్తిని ఎవ్వరూ ఆహ్వానించలేదు. కానీ ప్రసాద్‌ల్యాబ్‌లోనే ఎక్కువ సమయం గడిపే ఆయన టపాసుల శబ్దం విని ఈ వేడుక ప్రాంతానికి వచ్చారు. వేదిక మెట్లపై నిల్చుని నిర్మాత అల్లుఅరవింద్‌ చేసిన ప్రసంగాన్ని విన్నారు. 

ఇక ప్రసంగం ముగిసిన తర్వాత తనకు కాస్త పర్సనల్‌ పని ఉందని దిల్‌రాజుకి చెప్పి అరవింద్‌ వేదిక నుంచి కిందకి దిగి వెళ్లిపోదామని రెడీ అవుతుండగా, పీపుల్స్‌స్టార్‌ ఆయన్ను కాసేపు ఆగమని చెప్పి, అరవింగ్‌గారు కూడా సక్సెస్ ఫుల్‌ ప్రొడ్యూసర్‌. ఆయన మరో సక్సెస్‌పుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుని అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక దిల్‌రాజు ఈ ఏడాది ఇప్పటికే నాలుగు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. మరో రెండు రెడీగా ఉన్నాయి. ఆయన విజయాల వెనుక స్వర్గంలోని ఆయన శ్రీమతి అనిత గారి దీవెనలు ఆయనకు ఉన్నాయి. 

ఇక ఈమద్య వచ్చిన 'డిజె' చూశాను. బన్నీ డ్యాన్స్‌ల్లో ఇరగదీశాడు. నేను దిల్‌రాజు గారికి చేసే విన్పపం ఏమిటంటే.. మైఖేల్‌జాక్సన్‌ స్టోరీని, బన్నీని పెట్టుకుని బయోపిక్‌గా తీయాలి.. అన్నాడు. అనంతరం అరవింద్‌తో మీ అబ్బాయి గురించి నాలుగు మాటలు మాట్లాడాలని ఉండమన్నాను. ఇక మీరు వెళ్పిపోవచ్చని చెప్పారు. 'ఫిదా' చూసి 'ఫిదా' అయ్యాను. శేఖర్‌కమ్ముల గోదావరిని ఎంతో గొప్పగా చూపించారు. ఇక ఆయన ఆంధ్రా వ్యక్తి అయినా తెలంగాణ పద్దతులను, యాసను, సంప్రదాయాలను ఎంతో అద్భుతంగా తీశాడు. 

ఆయన తెలుగుకి ఓ హృషికేష్‌ముఖర్జీ, ఓ గుల్జార్‌ అని కొనియాడాడు. ఇక తెలంగాణ సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రాలో కూడా బాగా ఆడుతుండటం మంచి పరిణామమన్నాడు. మొత్తానికి తన స్పీచ్‌తో ఆర్‌.నారాయణమూర్తి హల్‌చల్‌ చేసేశాడు. చివరికి దిల్‌రాజు ఈ వేడుకను క్లాస్‌గా నిర్వహించాలనుకున్నాం. కానీ నారాయణమూర్తి వచ్చి దీనిని మాస్‌ వేడుక చేశాడు అని చెప్పడం గమనార్హం. 

R Narayana Murthy Wants Allu Arjun in Michael Jackson Biopic:

Narayana Murthy advised producer Dil Raju and Allu Aravind to produce a biopic on Michael Jackson roping in Allu Arjun in the lead role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ