Advertisementt

బాలయ్యో...ఆ వాయస్సెందయ్యో..!!

Sat 29th Jul 2017 08:48 PM
balakrishna,paisa vasool,puri jagannadh,balakrishna voice  బాలయ్యో...ఆ వాయస్సెందయ్యో..!!
Balakrishna's voice Problem in Paisa Vasool Stumper! బాలయ్యో...ఆ వాయస్సెందయ్యో..!!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ బయట ఎలా మాట్లాడినా సినిమాల్లో మాత్రం పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టేస్తాడనేది తెలిసిన విషయమే. మాములుగా బాలయ్య బయట ఎక్కడన్నా మాట్లాడితే తాను పలికే మాటలకూ స్పష్టత లేకుండా కాస్త గందరగోళం చేసేస్తుంటాడు. కానీ సినిమాలో మాత్రం బాలయ్య డైలాగ్స్ కి నందమూరి అభిమానులు పిచ్చెక్కిపోయి తాండవం చేస్తారు. ఇక సినిమాల్లో కూడా బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టే రైటర్స్ డైలాగ్స్ రాస్తుంటారు. వారు రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ ని బాలకృష్ణ తన గ్రేస్ వాయిస్ తో మంచి ఎక్సప్రెషన్స్ తో అరిపించేస్తాడు. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అంటుంటారు. మరి ఇంత పవర్ ఫుల్ డైలాగ్స్ ని ఈజీగా చెప్పేసే బాలయ్య మొదటిసారి ఫ్యాన్స్ నే కాదు టోటల్ తెలుగు ప్రేక్షకులని నిరాశపరిచాడని అంటున్నారు.

ఎప్పుడూ ఎదుటి వారికి దడ పుట్టించేలా ఉండే బాలకృష్ణ మొదటిసారి డైలాగ్ డెలివరీలో వణుకుతూ డైలాగ్ చెప్పి జనాలకు ఒణుకు పుట్టించాడు. పూరి డైరెక్షన్ లో 101 వ చిత్రం గా పైసా వసూల్ చేస్తున్నాడు బాలకృష్ణ. అయితే తాజాగా ట్రైలర్ కి తక్కువ... టీజర్ కి ఎక్కువ అంటూ డైరెక్టర్ పూరి పైసా వసూల్ స్టంపర్ అంటూ అందరిలో ఆసక్తి క్రియేట్ చేశాడు. అయితే మొదటినుండి భారీ అంచనాలున్న ఈ పైసా వసూల్ స్టంపర్ అంచనాలకు తగ్గట్టుగానే... స్టైలిష్ లుక్ లో... కళ్ళు చెదిరే విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీన్స్ తో... పూరి మార్క్ డైలాగ్స్ తో స్టంపర్ సూపర్ గానే ఉంది. కానీ అందులోని బాలకృష్ణ వాయిస్ మాత్రమే మైనస్ గా అనిపించిందనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

పైసా వసూల్ స్టంపర్ లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా బాలకృష్ణ వాయిస్ అసలు ఆకట్టుకోలేకపోయింది... పవర్ ఫుల్ గా చెప్పాల్సిన డైలాగ్స్ బాలయ్య బాబు వణుకుతూ చెప్పాడనే కామెంట్స్ పడుతున్నాయి. ఈ వాయిస్ డెలివరీతో బాలయ్య ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే పైసా వసూల్ టైటిల్ బాలకృష్ణ కి సూట్ కాదని వర్రీ అవుతుంటే ఇప్పుడు బాలయ్య డైలాగ్ డెలివరీ కూడా వీక్ గా ఉండడంతో వారి టెన్షన్ మరింత ఎక్కువవుతుంది అంటున్నారు.

Balakrishna's voice Problem in Paisa Vasool Stumper!:

Balayya's voice in the stumper which embarrassed fans to some extent. His voice had the quivers while mouthing dialogues.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ