మొత్తానికి తెలుగులో 'బిగ్ బాస్'షోకి డివైడ్ టాక్ వస్తోంది. కొందరు పార్టిసిపెంట్స్ స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారని, కావాలనే గొడవలు క్రియేట్ చేస్తూ ఎపిసోడ్స్ కామెడీని సృష్టిస్తున్నాయని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం ఈ షో చాలా ఆసక్తికరంగా ఉందంటున్నారు. మొత్తానికి ఈ షోపై సెటైర్లు వేసేవారు కూడా దీనిని రెగ్యులర్‌గా వాచ్ చేస్తున్నారు అనేది నిజం, ఇక ఈ షో నుంచి బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు అలియాస్ సంపూ ఉన్నట్లుండి షో నుంచి బయటకు వచ్చాడు.
ఇక ఈ షోలో పాల్గొంటున్నవారిలో బాగా ఆకట్టుకుంటున్నది సంపూనే కావడం, ఇప్పుడు అతను ఔట్ కావడంతో తదుపరి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ షోలో పలు షరత్తులు, అగ్రిమెంట్లు ఉంటాయి. వారు పాల్గొంటున్నందకు ఒక్కోరోజుకి ఇంత చొప్పున అని రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు. ఇక బిగ్‌బాస్ ద్వారా ఎలిమినేట్ అయితే నష్టం లేదు గానీ ఆ వాతావరణం, పరిస్థితులు తట్టుకోలేక బయటకు వస్తే మాత్రం ఫైన్ కట్టాల్సివుంటుంది.
ఇక ఈ షో మొదలైన మొదట్లో ఉత్సాహంగానే ఉన్నసంపూ 10రోజులు తిరిగే సరికి మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఒకానొక సమయంలో అరిచి, చచ్చిపోతానని కత్తితో కోసుకునే దాకా వెళ్లాడు. ఇక ఆ తర్వాత ఏడ్చేశాడు. దీంతో ధన్‌రాజ్ అంతా మంచే జరుగుతుందని ఎలిమినేట్ కావాలంటే మిగిలిన పార్టిసిపెంట్స్‌తో మాట్లాడి అతడిని ఎలిమినేట్ చేయిస్తానని సర్దిచెప్పాడు. కానీ కొత్త ప్రదేశాలన్నా, కిటికీలు, లిఫ్ట్‌లు, జనరద్దీ ఎక్కువగా ఊపిరి ఆడని తరహా ఫోబియా ఇతనికి ఉందనే నిర్ణయానికి అందరూ వచ్చారు.
తనను బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయమని ఆయన బిగ్‌బాస్‌ని బతిమిలాడి, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరిండంతో పాటు బిగ్‌బాస్‌ని ఇష్టం వచ్చినట్లుతిట్టాడు. ఇక ఆయన పాల్గొన్న రోజులకు ముట్టే పారితోషికంను తగ్గించుకోగా ఆయనే ఈ షో నిర్వాహకులకు ఏకంగా 16 నుంచి 20లక్షల వరకు కట్టాల్సివస్తుందట. 70రోజులు గడిని 70లక్షలు గెలుచుకోవాలని భావించిన సంపూ ఇప్పుడు తానే షో వాళ్లకి పెనాల్టీ కట్టాల్సి రావడం బాధాకరమే. అయితే ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం మానసికంగా అంత సులభం కాదని సైకాలజీ తెలిసిన వారు విశ్లేషిస్తున్నారు.