సహజంగా బాలకృష్ణ చిత్రం అంటే అందులో ఆయన ఎన్ని వెరైటీ గెటప్‌లు వేసినా రొటీనే అనిపిస్తాయి. తనకు అసలు సెట్‌గాని విగ్గులతో కూడిన హెయిర్‌స్టైల్స్‌తో కనిపిస్తుంటాడు. అదిరిపోయే ఐదారు పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్‌లు, మరో రెండు మూడు తన వంశం గురించి, తన తండ్రిని గురించి చెప్పే ఓకే విధమైన డైలాగ్‌లు చెప్పే డెలివరీ, వేటకొడవళ్లు, కత్తులు, కటార్లు, ఇంకా వీలుంటే గొడ్డళ్లతో విలన్లను వేటాడే సీన్లు వంటి రొటీన్‌వే తప్ప.. ట్రెండ్‌కి తగ్గట్లుగా మాత్రం బాలయ్య మారడు. అయినా నందమూరి అభిమానులు దానికే పండగ చేసుకుంటారు. స్టెప్స్‌లో కూడా తనకొచ్చిన ఆ మూస ధోరణే ఉంటుంది.
కానీ తాజాగా విడుదలైన ఎన్బీకే 101 'పైసా వసూల్' స్టంపర్ మాత్రం పూర్తిగా స్టైలిష్‌గా, పూరీ మార్కుతో ఉందని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం స్టంపర్ ఎంతో స్టైలిష్‌గా ఉంది. 'అన్నా.. రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి...' అని బాలయ్య నోటి నుంచి ఎవరైనా ఇలాంటి డైలాగును విన్నారా? లేదు. కానీ అదే పూరీ స్టైల్. ఈ చిత్రంలో అది ఓ డైలాగ్. అదేదో మామూలు సీన్ కాదు. యాక్షన్ సీన్‌కి ముందు వచ్చే డైలాగ్. బాలయ్య రెండు బాల్కనీ టిక్కెట్లు అడిగితే విలన్ దానికి 'ఇది సినిమా కాదు' అంటాడు. దానికి బాలయ్య...సినిమా కాకపోతే మరేమిటి? ఐ యామ్ ది హీరో...యూ ఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్.. దిస్ ఈజ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ విలన్‌ని చితగ్గొడతాడు. దీనిలో బాలయ్య స్టైల్స్ అదుర్స్ అనిపించాయి. ఇప్పటివరకు చూడని బాలయ్య ఇందులో కనిపించాడు.
ముఖ్యంగా ఆయన గన్ తిప్పే స్లైల్ హైలైట్ అయింది. ఈ స్టంపర్‌ని చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌లో కనిపిస్తోంది. తమ్ముడు.. నేను జంగిల్‌బుక్ చిత్రం చూడలా... కానీ అందులో పులి నాలాగే ఉంటుందని, చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి... అనే డైలాగ్, అదిరిపోయే కిక్‌లాంటి పాటలు, మరీ ముఖ్యంగా ఐటమ్ అదిరిపోయినట్లే అందరూ భావిస్తున్నారు. ఇందులో తన పాత స్టెప్స్‌ని పక్కనపెట్టిన బాలయ్య సరికొత్త స్టెప్స్‌తో కనిపించడం ఖాయం. ఇక అనూప్‌రూబెన్స్‌అందించిన సంగీతం కూడా భలే మజాగా ఉంది. మందేసిన మదపుటేనుగునురా... క్రష్ ఎవ్విరివన్.... వంటి డైలాగులు చూస్తే ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా అంచనాలు మిన్నంటాయి. సో.. ఇక ఈచిత్రం విడుదల కోసం అందరూ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసి రోజులని లెక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.