నయనతారకి కోలీవుడ్ లో ఎదురే లేదు. ఆమె అడిగిన మొత్తం ఇచ్చి ఆమె పెట్టె కండిషన్స్ కి తలొగ్గి నిర్మాతలు సినిమాల్లో ఆమెని బుక్ చేసుకుంటున్నారు. అంతగా నయనతార డిమాండ్ కోలీవుడ్ లో ఉంది. ఎందుకంటే ఆమె టాప్ స్టార్స్ సరసన...చేస్తూనే మరో పక్క లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా దూసుకుపోతుంది. అందుకే తమిళనాట నయన్ కి అంత క్రేజ్. అయితే ఇప్పుడు మరో భామ నిర్మాతలకు కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతూ చుక్కలు చూపిస్తుందట. ఇప్పటివరకు కెరీర్ లో నిర్మాతల సైడ్ నుండి ఒక్క కంప్లైంట్ కూడా లేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తొచ్చేది సమంతానే. ఎప్పుడూ నిర్మాతలతో స్నేహ సంబంధాలు కొనసాగించే సమంత ఇప్పుడు రివర్స్ రూట్ లో వెళుతుందట.
ఇక నిర్మాతలకు కావాల్సిన కాల్షీట్స్ ఇస్తూ వారికి ఫెవర్ గా ఉండే సమంత ఒక్కసారిగా మారిపోయిందని ఆమె కండిషన్స్ కి తాము బెదిరిపోతున్నామని... కోలీవుడ్ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో, కోలీవుడ్ లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. తమిళంలో ఏకంగా మూడు సినిమాలు చేతిలో పెట్టుకున్న సమంత అక్కడి స్టార్ హీరోలతో జోడి కడుతుంది. అయితే సమంత ఇప్పుడు తమిళంలో విజయ్ సేతుపతి తో నటించే సినిమా కోసమే ఆయా నిర్మాతలకు బోలెడు కండిషన్స్ పెడుతుందని ఎప్పటినుండో ప్రచారంలో ఉంది.
తనకి ఎండ పడదని... అందుకే షూటింగ్ ఔట్ డోర్ లో పెట్టొద్దని... ఒకవేళ పెట్టినా ఎండ తగలకుండా అంతా కప్పెయ్యాలనే కండిషన్స్ పెట్టినట్లు మొన్నా మధ్యన వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ కండిషన్ కి తోడు కాల్షీట్ కింద కేటాయించిన సమయాన్ని కూడా బాగా తగ్గించి నిర్మాతలకు చుక్కలు చూపెడుతుంది సమంత. అలాగే సినిమా షూటింగ్ ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా సాయంత్రానికల్లా హైదరాబాద్ లేదా చెన్నైలోని తన ఇంటికి వెళ్లిపోయేలా టైమ్ ఎడ్జెస్ట్ చేయాలని నిర్మాతలకు కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతూ నిర్మాతలను భయపెట్టేస్తోందట. ఇక ఈమెగారి కండిషన్స్ కి తట్టుకుని తగిన సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయలేక నానా హైరానా పడుతున్నారట మేకర్స్.