Advertisementt

స్టంపర్‌ అంటే ఏమిటో తెలుసా..?

Thu 27th Jul 2017 04:34 PM
balakrishna,nbk 101 movie,paisa vasool,director puri,stumper release on july 28th  స్టంపర్‌ అంటే ఏమిటో తెలుసా..?
Balakrishna Paisa Vasool Stumper on July 28th స్టంపర్‌ అంటే ఏమిటో తెలుసా..?
Advertisement
Ads by CJ

పూరీ జగన్నాథ్‌ ఏది చేసినా ఆయన స్టైల్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. హీరోల లుక్‌ నుంచి, వారి మేనరిజమ్స్‌, వారి చేత పలికించే డైలాగ్‌లు, సినిమా టైటిల్‌ వరకు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక పూరీ డ్రగ్స్‌ కేసులో ఉన్నా కూడా ఆయన తన బాలయ్య 101వ చిత్రం 'పైసా వసూల్‌'లో బిజీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 'NBK 101 ఫీవర్‌' అని రెండు రోజుల కిందట ఓ హ్యాష్‌ట్యాగ్‌ని సోషల్‌ మీడియాలో పెట్టి ప్రమోషన్‌కి శ్రీకారం చుట్టారు. 

ఇక ఇందులోని బాలయ్య లుక్‌లను తాజాగా వదిలారు. అందుకే బాలయ్య గతం కంటే ఎంతో బాగున్నాడు. ఇక ఈ చిత్రం మంచి అంచనాలు ఏర్పరచుకోవడంతో బయ్యర్లు వచ్చారు. కానీ సినిమాని తొందరపడి అమ్మవద్దని స్టంపర్‌ని కట్‌ చేసి బయ్యర్లకు చూపిస్తే మరింత బిజినెస్‌ జరుగుతుందని నిర్మాత కె.ఆనంద్‌ ప్రసాద్‌కి పూరీ భరోసా ఇచ్చాడు. ఇక ఈ చిత్రం స్టంపర్‌ని చూపించి మంచి బిజినెస్‌ చేస్తున్నారని సమాచారం. ఈ స్టంపర్‌ చాలాస్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందిట. అంటే ఈ స్టంపర్‌ అనేది టీజర్‌ కంటే కాస్త ఎక్కువ నిడివి, ట్రైలర్‌ కంటే కాస్త తక్కువ నిడివితో ఉంటుంది. 

దీనికి సంబంధించి స్టంపర్‌ అంటే ఏమిటో ఓ చిన్న వీడియోను కూడా ఎంతో స్టైలిష్‌గా రూపొందించి విడుదల చేశారు. ఈ స్టంపర్‌ని ఈనెల 28వ తేదీన బాలయ్య నిర్ణయించిన ముహూర్తమైన ఉదయం 10గంటల 12 నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 29వ తేదీన రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 

Balakrishna Paisa Vasool Stumper on July 28th:

Puri Jagannadh announced the kick start of film promotions and released some vibrantly looking Balayya pictures from Paisa Vasool which surely hiked all the expectations. At the same time, Puri and producer Anand Prasad also locked Paisa Vasool stumper to be unveiled on July 28th at 10.12 AM.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ