డ్రగ్స్ కేసులో సినిమా వారిని విచారిస్తుండటంతో పూరీ నుంచి కేసులో సంబంధం లేని ఆర్.నారాయణమూర్తి,దిల్‌రాజు, వర్మ, రోజా వరకు నానా మాటలు పేల్చుతున్నారు. తెలంగాణకు 'బాహుబలి' వల్ల వచ్చిన మంచిపేరు డ్రగ్స్ విచారణ వల్ల పోతోందని, ఇంత వరకు ముంబైలోని వారికి కేసీఆర్, తెలంగాణ, హైదరాబాద్‌లపై ఎంతో నమ్మకం ఉండేదని, కానీ ముంబై వాసులు ఇప్పుడు ముంబై, పంజాజుల కన్నా హైదరాబాద్ చెడిపోతోందని ఈసారి ఆయన తెలంగాణ ప్రభుత్వానికి డ్రగ్స్ కేసుకు ముడివేస్తూ ట్వీట్స్ చేశాడు.
అసలు ఇంతా జరుగుతున్నా కూడా పిల్లి కళ్లు మూసుకుని ఎవ్వరూ చూడకుండా పాలు తాగుతున్నానని అనుకోనే విధంగా, హైదరాబాద్‌లో డ్రగ్స్ లభిస్తూన్నా కూడా అదేం లేదని హూంకరించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, డిజీపీ అనురాగ్‌శర్మ, సభర్వాల్‌ని డ్రగ్స్‌లేని సిటీగా హైదరాబాద్‌ని, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను ఉంచాలని భావిస్తూ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతుండటం వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి, అదికారులకు మంచి పేరు వస్తోందే గానీ వర్మ చెప్పినట్లు చెడ్డ పేరురావడం లేదు.
ఏపీలోని సామాన్యులు కూడా ఏపీ సీఎం చంద్రబాబు సినిమా గ్లామర్ అంటే మోజు పడి వదిలేసేవాడని, కానీ కేసీఆర్ మాత్రం బాగా పనిచేస్తున్నాడని ఓ వైపు పొడుగుతుంటే వర్మ చెడ్డపేరు వస్తోంది అంటున్నాడు. అసలు ముందు వర్మ తనకు చెడ్డపేరు రాకుండా చూసుకుంటే అది మేలు. హైదరాబాద్, తెలంగాణ, కేసీఆర్‌లకి చెడ్డపేరు వస్తోందని తర్వాత బాధపడవచ్చు. తమ సినిమాలలో ఏమేమో చూపించి ఎవరైనా తమను, తమ కులాన్ని, పోలీసులను లేదా రాయలసీమ వారందరినీ ఫ్యాక్షనిస్తూలుగా చూపిస్తున్నారని బాధపడితే ప్రతి చిన్న విషయానికి మన ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని జోకులు వేసే సినిమా వారు ఇప్పుడు డ్రగ్స్ కేసులో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడుతుంటే... సరిగా జరిగిందన ఎందరో హర్షం వ్యక్తం చేస్తున్నారు.