చిరంజీవి తిరిగివచ్చాడని ఇతర హీరోలు సినిమాలు చేయకుండా మానేశారా? లేదే..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్' చేస్తున్నాడని, అదే టైమ్ లో 'నెంబర్ 1 యారి' షో చేస్తున్న రానా వెనక్కి తగ్గాడా? లేదే.. ! మరి అలాంటప్పుడు రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' విషయంలో ఎందుకు తగ్గుతాడు. విషయంలోకి వస్తే బోయపాటి 'జయ జానకి నాయక', నితిన్ 'లై' చిత్రాలతో పాటు రానా, తేజల 'నేనే రాజు నేనే మంత్రి' కూడా ఆగష్టు 11 న విడుదల అవుతుంది. అయితే ఈ రేసులో నుండి రానా తప్పుకుని సోలోగా వస్తాడని తాజాగా వార్తలు వినిపించాయి.
అయితే రానా మాత్రం అస్సలు తగ్గే ప్రసక్తే లేదు అంటున్నాడు. సినిమా టీజర్ మరియు ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కంటెంట్ ఉన్నప్పుడు కాలం కోసం వెయిట్ చేయడం ఏంటి? ఎదురు ఎంత పెద్ద సినిమా ఉంటే మనకేంటి? అన్నట్లుగా మొదటి నుండి చిత్ర యూనిట్ ఈ సినిమా పై ఎంతో కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. అదే కాన్ఫిడెన్స్ తో ఈ చిత్రం.. పై రెండు సినిమాలకి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆగష్టు 11 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి అన్ని రెడీ అయినట్లుగా చిత్ర యూనిట్ తెలుపుతుంది.