Advertisementt

బాలయ్య లుక్ ఇప్పుడెక్కింది..!!

Wed 26th Jul 2017 06:18 PM
balakrishna,paisa vasool,puri jagannadh,paisa vasool movie new look  బాలయ్య లుక్ ఇప్పుడెక్కింది..!!
Balakrishna New Look in Paisa Vasool బాలయ్య లుక్ ఇప్పుడెక్కింది..!!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ 'పైసా వసూల్' అని అనౌన్స్ చేసిన రోజు నందమూరి అభిమానులే కాదు మరే ఇతర తెలుగు ప్రేక్షకుడు కూడా ఇదేం టైటిల్.... బాలకృష్ణ కి ఇలాంటి టైటిల్ పెట్టడం ఏమిటని పెద్ద చర్చే జరిగింది. అందులోను ఈ సినిమాలో బాలయ్య బాబు గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు అంటే ఒకే గాని ఆ లుక్ ఏమిటి.... గ్యాంగ్ స్టర్ లుక్ లో బాలకృష్ణ అస్సలు బాగోలేదని... ఆ గెటప్  బాలయ్య కి అస్సలు సూట్ కాలేదని నందమూరి ఫాన్స్ తలలు బద్దలు కొట్టేసుకున్నారు. అయితే ఇప్పుడు చిత్ర టీమ్ బాలకృష్ణ 'పైసా వసూల్' లేటెస్ట్ పిక్స్ ని మీడియాకి విడుదల చేసింది.

ఆ పిక్స్ లో బాలకృష్ణ ఎంతో అందంగా, హుందా తనంతో సూపర్ గా కనిపించడం చూసి అభిమానులు కాస్త రిలీఫ్ ఫీల్ అవ్వడమే కాదు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాధ్, బాలకృష్ణ వంటి హీరోతో సినిమా చెయ్యడం ఆనందంగా వుందని, అలాగే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుందని చెబుతున్నాడు. ఇక  అభిమానులు కోరుకునే అంశాలు ఇందులో పుష్కలంగా వుంటాయని, డైలాగ్స్, సాంగ్స్ అంచనాలకు అనుగుణంగా ఉంటాయని కూడా మాటిచ్చాడు. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఫొటోస్ పూరి చెప్పిన స్థాయిలో ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇకపోతే 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడ్యూషన్ పనుల్లో బిజీగా ఉండడమే కాక పబ్లిసిటీ పనులమీద కూడా ఫోకస్ పెట్టింది. ఇక 'పైసా వసూల్' చిత్రాన్ని డిఫరెంట్  పబ్లిసిటీ తో ఆకట్టుకోవడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. బాలకృష్ణ- శ్రేయ - ముస్కాన్ లు నటిస్తున్న ఈ 'పైసా వసూల్' స్టంపర్‌ను ఈ నెల 28 న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇక ఈ స్టంపర్  రెగ్యులర్‌గా వచ్చే టీజర్.. ట్రైలర్‌కి భిన్నంగా వుండనుందని చెబుతున్నారు.

Balakrishna New Look in Paisa Vasool:

Balakrishna and Puri Jagannadh's Paisa Vasool Movie New Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ