ఈ రోజు విభిన్నచిత్రాల హీరోగా పేరు తెచ్చుకుంటున్న నారా రోహిత్ పుట్టిన రోజు. తన మొదటి చిత్రం 'బాణం' నుండి నిన్నటి 'శమంతకమణి'వరకు ఆయన వైవిద్యానికే పెద్ద పీట వేస్తాడు. ఇక ఆయన కిందటి ఏడాది ఏకంగా అరడజను చిత్రాలతో వచ్చాడు. 'జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒక్కడుండే వాడు' చిత్రాలు బాగానే ఆడాయి. ఇక ఆయన నటిస్తున్న మరో విభిన్నచిత్రం 'కథలో రాజకుమారి' చిత్రంలో ఆయన లుక్‌కి మంచిరెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చేయనున్నారు.
ఇక తాజాగా ఆయన పవన్ మల్లెల దర్శకత్వంలో చేస్తున్న 'బాలకృష్ణుడు' మోషన్ పోస్టర్‌కి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభిస్తోంది. బాగా స్లిమ్‌గా తయారైన తర్వాత ఆయన తన బాడీని చూపిస్తూ, చొక్కా బటన్లు వదిలేసి ఉన్న ఆయన లుక్ సూపర్‌గా ఉంది. ఇక ఇందులోని పోస్టర్‌లో హైదరాబాద్‌లోని బుద్దుని విగ్రహం, కర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు, వరసగా వెళ్తున్న సుమోలు, కొన్ని సుమోలు గాలిలో చూపించడం చూస్తుంటే ఇదేదో మాంచి మాస్ యక్షన్ సినిమా అనే అర్ధమవుతోంది.
ఇక ఈచిత్రాన్ని భారీ చిత్రాల పోటీలో ఏదో ఒక వారం సెప్టెంబర్‌లోనే విడుదల చేయనున్నారు.ఇక బాలయ్యపై తనకు ఉన్న అభిమానంతో పెట్టిన టైటిల్ 'బాలకృష్ణుడు' కూడా క్యాచీగా ఉంది. ఇక గతంలో బాలయ్య 'బాలగోపాలుడు' చేస్తే ఇప్పుడు నారా రోహిత్ 'బాలకృష్ణుడు' చేస్తున్నాడు. టైటిల్ సాప్ట్‌గా ఉన్నా, సినిమా మాత్రం మాస్ అండ్ యాక్షన్‌తో నిండివుండనుంది...!