Advertisementt

ఎన్టీఆర్‌ ఆడియో డేట్‌ ఫిక్సయింది..!

Wed 26th Jul 2017 02:53 PM
jr ntr,kalyan ram,director bobby,jai lava kusa audio release on august 12th  ఎన్టీఆర్‌ ఆడియో డేట్‌ ఫిక్సయింది..!
Jai Lava Kusa Audio and Teaser Date Fix ఎన్టీఆర్‌ ఆడియో డేట్‌ ఫిక్సయింది..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ మంచి జోరుమీదున్నాడు. ఒకవైపు 'జై లవ కుశ', మరో వైపు 'బిగ్‌ బాస్‌'లతో బిజీ బిజీ. ఇక 'జై లవ కుశ' విషయంలో కూడా టైటిల్‌ని, లోగోను, మోషన్‌ లోగోను తొందరగానే రివీల్‌ చేశారు. ఆ తర్వాత ఒకట్రెండు ఫస్ట్‌లుక్స్‌ వదిలారు. ఇటీవలే 'జై' పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదలై అద్బుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. అదే సమయంలో ఈ చిత్రంలోని మిగిలిన రెండు క్యారెక్టర్లయిన 'లవ, కుశ'ల టీజర్లను కూడా మరో రెండు మూడు వారాలలో రిలీజ్‌ చేయనున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా పూణెలో బాలీవుడ్‌ మూవీ 'రామ్‌లీలా' చిత్రాన్ని షూట్‌ చేసిన భవంతిలోనే ఈ చిత్రాన్ని తీస్తున్నారు. మరో పక్క ఈ చిత్రానికి సంబంధించిన ఆరు పాటలకు దేవిశ్రీప్రసాద్‌ ఎప్పుడో ట్యూన్స్‌ రెడీ చేశాడు. త్వరలో రికార్డింగ్‌ చేయనున్నారు. ఆగష్టు 12వ తేదీ సాయంత్రం ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారట. శనివారం రాత్రి కావడంతో ఈ తేదీనీ ఫిక్స్‌ చేశారట. ఆడియో వేడుక నాటికి టాకీపార్ట్‌ని పూర్తి చేయలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. 

ఆ తర్వాత పాటల చిత్రీకరణ జరపనున్నారు. సెప్టెంబర్‌ 21న 'జై లవ కుశ'ను ధియేటర్లలోకి తెచ్చేందుకు సన్నద్దమవుతున్నారు. ఆడియో విడుదల రోజు నుంచే భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలను థియేటికల్‌ ట్రైలర్లను కూడా రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. 

Jai Lava Kusa Audio and Teaser Date Fix:

Team of 'Jai Lava Kusa' movie is contemplating to launch the audio and theatrical trailer on August 12th. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ