'డిజె' సంగతేమో గానీ 'ఫిదా' చిత్రం మాత్రం మొదటి షో నుంచే అద్భుతమైన టాక్ సాధించింది. చూసిన వారంందరూ సూపర్బ్ అంటున్నారు. ఈ చిత్రం దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు మెగాహీరో వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలవడం ఖాయమని తేలిపోయింది. ఈ చిత్రం బడ్జెట్ అనుకున్న దాని కన్నా 10శాతం బడ్జెట్ ఎక్కువైందని, అయినా అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చిందని నాడే దిల్‌రాజు తెలిపాడు.
కాగా ఈ చిత్రానికి 15కోట్ల బడ్జెట్ ఖర్చయిందని, దానికి రెట్టింపును వసూలు చేయడం గ్యారంటీ అంటున్నారు. రెండోరోజునే యూఎస్‌లో మిలియం మార్క్‌ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవికి అత్తగా నటించిన గీతా భాస్కర్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం విడుదలకు ముందే శేఖర్ కమ్ముల ఆ పాత్రపై ఎంతో నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ గీతా భాస్కర్ ఎవరో కాదు.. 'పెళ్లి చూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ తల్లి. ఈ చిత్రం విడుదలకు ముందే శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదల కాకుముందు గీతా భాస్కర్ ఎవరు అంటే దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి అంటారు.
సినిమా విడుదలైతే మాత్రం గీతా భాస్కర్ కొడుకు తరుణ్ భాస్కర్ అంటారని తెలిపాడు. ఇప్పుడు అదే నిజమైంది.దీనిపై ఆమె కుమారుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, తన తల్లి మొదటి చిత్రంలోనే మంచి పాత్రను ఎంతో బాగా పోషించిందని మెచ్చుకున్నాడు. మంచి పాత్రలో జీవం పోసింది. నా తల్లికి ఇది మొదటి చిత్రమే అయినా ఎంతో నేచురల్‌గా నటించింది అన్నాడు. ఇక ఆమె మరిన్ని ఇలాంటి మంచి పాత్రలు చేయాలని అందరూ కోరుకున్నా ఆమె మరలా నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రం బి,సి సెంటర్లలో మాత్రం డల్‌గానే ఉంది. అయినా దిల్‌రాజుకి డబ్బులు రావడం ఖాయమేనంటున్నారు.