Advertisementt

సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ..!

Tue 25th Jul 2017 08:25 PM
bhagiratha,senior journalist,censor board member,venkaiah naidu  సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ..!
Bhagiratha nominated as Censor Board Member సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ..!
Advertisement
Ads by CJ

సీనియర్ జర్నలిస్టు, రచయిత, కవి.. భగీరధను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడుగా నియమించింది. సినిమా రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న భగీరథ ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. భగీరథ గతంలో కూడా సెన్సార్ బోర్డు సభ్యుడుగా నాలుగు సంవత్సరాల పాటు పని చేసిన అనుభవం ఉంది. భగీరథ నంది అవార్డుల కమిటీ, జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ, దూరదర్శన్ స్క్రిప్ట్ మరియు స్క్రీనింగ్ కమిటీ, తెలుగు ఉత్తమ పుస్తకాల ఎంపిక కమిటీ సభ్యుడుగా పని చేసిన అనుభవం ఉంది. రెండు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డులు వచ్చాయి. ఎన్నో సంస్థలు ఉత్తమ జర్నలిస్టుగా అవార్డుల్ని ఇచ్చి సత్కరించాయి.

జర్నలిస్టుగా, రచయితగా అమెరికా వెళ్లి అక్కడ దక్షిణ భారత దేశ  చరిత్ర మీద ప్రసంగించారు. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీమతి జమున, శ్రీ వి.బి.రాజేంద్ర ప్రసాద్ మొదలైన వారి మీద 12 పుస్తకాలు వెలువరించారు. 2010లో తెలుగు సినిమా మీద ఆయన రాసిన ఒక పాఠ్యాంశం డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎమ్మె ద్వీతీయ సంవత్సరం విద్యార్థులకు బోధిస్తున్నారు.

రాగ ద్వేషాలకు అతీతంగా సినిమాలను సెన్సార్ చేస్తానని, తనకు  వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని భగీరథ ఈ సందర్భంగా తెలిపారు. తనను సెన్సార్ బోర్డు సభ్యుడుగా నియమించిన సమాచార ప్రసారాల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడుకు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు.

Bhagiratha nominated as Censor Board Member:

Senior Journailist Bhagiratha in New Role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ